Stock Market Today, 27 April 2023: ఇవాళ (గురువారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 35 పాయింట్లు లేదా 0.19 శాతం రెడ్‌ కలర్‌లో 17,795 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: HUL, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, విప్రో, LTIMindtree, టెక్ మహీంద్ర, లారస్ ల్యాబ్స్. వీటిపై మార్కెట్‌ దృష్టి ఉంటుంది.


SBI లైఫ్: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎస్‌బీఐ లైఫ్ రూ. 777 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ. 672 కోట్లతో పోలిస్తే ప్రస్తుత లాభం 15% ఎక్కువ.


బజాజ్ ఫైనాన్స్: 2022-23 నాలుగో త్రైమాసికానికి రూ. 3,158 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ. 2,419 కోట్లతో పోలిస్తే 30% ఎక్కువ.


HDFC లైఫ్: జనవరి-మార్చి కాలానికి HDFC లైఫ్ ఇన్సూరెన్స్ రూ. 359 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలోని రూ. 357 కోట్లతో పోలిస్తే లాభం వృద్ధి ఫ్లాట్‌గా ఉంది.


L&T టెక్: IT సేవల సంస్థ L&T టెక్, మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో, తన నికర లాభంలో 22% వృద్ధితో రూ. 1,170 కోట్లకు నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం రూ. 8,014 కోట్లకు చేరుకుంది, ఇది కూడా సంవత్సరానికి 22% వృద్ధి.


ఒరాకిల్ ఫైనాన్షియల్: FY23 నాలుగో త్రైమాసికంలో రూ. 479 కోట్ల నికర లాభాన్ని కంపెనీ నివేదించగా, కార్యకలాపాల ద్వారా రూ. 1,470 కోట్ల ఆదాయం వచ్చింది.


సిటీ యూనియన్ బ్యాంక్: మూడు సంవత్సరాల కాలానికి సిటీ యూనియన్ బ్యాంక్ MD & CEOగా ఎన్‌.కామకోడిని పునర్నియమించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదించింది. ఈ నియామకం మే 1 నుంచి అమల్లోకి వస్తుంది.


సింధు టవర్స్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఒరాకిల్ ఫైనాన్షియల్ రూ. 1,399 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అదే సమయంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 6,752 కోట్లుగా ఉంది.


షాపర్స్ స్టాప్‌: మార్చి త్రైమాసికంలో షాపర్స్ స్టాప్ నికర లాభం రూ. 14.3 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 15.9 కోట్ల నష్టంలో ఉంది. Q4FY23లో ఆదాయం 30% పెరిగి రూ. 924 కోట్లకు చేరుకుంది.


సింజీన్ ఇంటర్నేషనల్‌: సింజీన్ ఇంటర్నేషనల్ రూ. 179 కోట్ల నికర లాభాన్ని, రూ. 995 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.


ఓల్టాస్: జనవరి-మార్చి కాలానికి ఓల్టాస్ రూ. 143 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఆదాయం రూ. 2,957 కోట్లు వచ్చింది.


RVNL: రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌ (RVNL)కి "నవరత్న హోదా"ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.