Stock Market Today, 24 April 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 54 పాయింట్లు లేదా 0.31 శాతం గ్రీన్ కలర్‌లో 17,693 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: ఇండస్‌ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పెర్సిస్టెంట్ సిస్టమ్స్. వీటిపై మార్కెట్ దృష్టి ఉంటుంది.
విప్రో: బెంగళూరుకు చెందిన ఈ ఐటీ మేజర్ మార్చి త్రైమాసిక ఫలితాలు ఈ నెల 27న (గురువారం) విడుదల కానున్నాయి, షేర్ బైబ్యాక్ ప్రతిపాదనను కూడా అదే రోజు ప్రకటించవచ్చు.
ICICI బ్యాంక్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 9,122 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే (YoY) 30% పెరిగింది.
యెస్ బ్యాంక్: యెస్ బ్యాంక్ నికర లాభం సంవత్సరానికి (YoY) 45% తగ్గి రూ. 367 కోట్ల నుంచి రూ. 202 కోట్లకు పడిపోయింది.
సన్ ఫార్మా: తదుపరి ఔషధ బ్యాచ్‌లను విడుదల చేయడానికి ముందు మొహాలీ ఫ్లాంట్‌లో కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఈ కంపెనీని USFDA నిర్దేశించింది.
గోల్డ్‌స్టోన్ టెక్నాలజీస్: గోల్డ్‌స్టోన్ టెక్నాలజీస్, ఈ-మొబిలిటీ మేజర్ క్వాంట్రాన్ AG కలిసి ఒక JVని స్థాపించాయి. సస్టైనబిలిటీ సర్వీసెస్ అందించే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ రూపొందించడానికి ఈ జేవీని ఏర్పాటు చేశాయి.
కోటక్ మహీంద్ర బ్యాంక్: కోటక్ మహీంద్ర బ్యాంక్ CEOగా ఉదయ్ కోటక్ పదవీ కాలం ముగిసిన తర్వాత నాన్-ఎగ్జిక్యూటివ్ & నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించడానికి వాటాదార్ల ఆమోదం లభించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 19% పెరిగి రూ. 19,299 కోట్లకు చేరుకుంది. ఏకీకృత ఆదాయం 2% పెరిగి రూ. 2.16 లక్షల కోట్లకు చేరుకుంది.
HDFC బ్యాంక్: HDFCతో విలీనానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొన్ని వివరణలను HDFC బ్యాంక్ అందుకుంది. అవి.. రుణాలు, పెట్టుబడులు, CLR, షేర్ల తాకట్టు రుణాలకు సంబంధించిన అంశాలు.
HDFC AMC: HDFC బ్యాంక్‌లో HDFC విలీనం నేపథ్యంలో, HDFC మ్యూచువల్ ఫండ్ సహ-స్పాన్సర్‌లో మార్పు కారణంగా, కంపెనీపై నియంత్రణ మార్పిడి అంశంలో HDFC AMCకి సెబీ నుంచి తుది ఆమోదం లభించింది.
హిందుస్థాన్ జింక్: మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో హిందుస్థాన్ జింక్ ఏకీకృత నికర లాభం 12% తగ్గి రూ. 2,583 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో ఇది రూ. 2,928 కోట్లుగా ఉంది.
యూనియన్ బ్యాంక్: వివిధ మార్గాల ద్వారా మూలధన సమీకరణ ప్రణాళికపై చర్చించి, ఆమోదించడానికి ఈ నెల 26న (బుధవారం) బ్యాంక్ బోర్డ్ సమావేశం అవుతుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.