Stock Market Today, 21 June 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.40 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 18 పాయింట్లు లేదా 0.09 శాతం రెడ్ కలర్‌లో 18,863 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
శ్రీరామ్ ఫైనాన్స్: నేషనల్ మీడియా రిపోర్ట్స్‌ను బట్టి, శ్రీరామ్ ఫైనాన్స్‌లో పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్ తన మొత్తం 8.34% వాటాను బ్లాక్ డీల్ ద్వారా అమ్మేసే అవకాశం ఉంది.
ఆర్కియన్ కెమికల్స్: నార్వేకు చెందిన నార్జెస్ బ్యాంక్, మంగళవారం, ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఆర్కియన్ కెమికల్స్‌లో కొంత వాటాను విక్రయించింది.
అవెన్యూ సూపర్‌మార్ట్స్: కంపెనీ బైయింగ్ అండ్ మర్చండైజింగ్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ కంపానీ తన పదవికి రాజీనామాను సమర్పించినట్లు అవెన్యూ సూపర్‌మార్ట్స్ (DMart) తెలిపింది.
ఫినో పేమెంట్స్ బ్యాంక్: రాకేష్ భార్టియా, బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్ పదవి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. వ్యక్తిగత కారణాలు & ఇతర అఫిషియల్ కమిట్‌మెంట్స్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
శిల్పా మెడికేర్: ఈక్విటీ షేర్ల రైట్స్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ ప్రతిపాదనను పరిశీలించేందుకు శిల్పా మెడికేర్ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 23న సమావేశం కానుంది.
HDFC: హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌లో మరింత వాటాను కొనుగోలు చేయడానికి హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు (HDFC) కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఓకే చెప్పింది.
పిడిలైట్ ఇండస్ట్రీస్: ఇటలీ నుంచి దిగుమతి చేసుకునే లిటోకోల్, టెనాక్స్ ఉత్పత్తులను భారతదేశంలోనే ఉత్పత్తి చేయనున్నట్లు పిడిలైట్ తెలిపింది. అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాలు గుజరాత్‌లోని అమోద్‌లో ఉన్నాయి.
HDFC AMC: ప్రమోటర్ గ్రూప్ Abrdn, మంగళవారం, బ్లాక్ డీల్స్ ద్వారా HDFC AMCలో తన మొత్తం వాటాను అమ్మేసింది.
RVNL: ఆర్‌వీఎన్‌ఎల్, TMH కలిసి ఏర్పాటు చేసిన JVలో విభేదాలు తలెత్తాయన్న వార్తలు నిరాధారమంటూ ఆర్‌వీఎన్‌ఎల్ స్పష్టం చేసింది.
BEL: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ. 5,900 కోట్ల విలువైన ఆర్డర్‌లను అందుకుంది.
గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్: ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి హస్ముఖ్ అధియా గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
ఎయిర్‌టెల్: మ్యాటర్ మోటార్ వర్క్స్ - భారతి ఎయిర్‌టెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. భారతదేశంలో మొట్టమొదటి గేర్ ఎలక్ట్రిక్ మోటార్‌బైక్ Matter AERAలో ఎయిర్‌టెల్ IoT సొల్యూషన్ ఫీచర్ తీసుకురావడానికి ఈ ఒప్పందం కుదిరింది.
ఇది కూడా చదవండి: మీ కుమార్తె చదువుకుంటే సర్కారే డబ్బులిస్తుంది, సెంట్రల్ స్కీమ్ ఇది
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial