Stock Market Today, 12 October 2023: కార్పొరేట్స్ నుంచి బలమైన క్వార్టర్లీ బిజినెస్ అప్‌డేట్స్‌తో పాటు, ద్రవ్యోల్బణం ఆందోళనలు తగ్గడంతో ఇండియన్ మార్కెట్లు బుధవారం కూడా, వరుసగా రెండో రోజు ర్యాలీ చేశాయి.
లాభాల్లో అమెరికన్ స్టాక్స్
U.S. ఫెడరల్ రిజర్వ్ గత సమావేశం మినిట్స్ విడుదల కావడంతో వాల్ స్ట్రీట్ ప్రధాన సూచికలు బుధవారం లాభాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లు స్థిరంగా ఉండవచ్చని ఇది సిగ్నల్స్ ఇచ్చింది.
పెరిగిన ఆసియా షేర్లు
హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ రీడింగ్ తగ్గడంతో US స్టాక్స్‌ను అనుసరించి ఆసియా షేర్లు కూడా గ్రీన్ ట్రేడ్ అవుతున్నాయి.
ఈ రోజు ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 18 పాయింట్లు లేదా 0.09 శాతం గ్రీన్ కలర్‌లో 19,848 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
TCS: 2023-24 సెప్టెంబర్ క్వార్టర్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రూ. 11,342 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో (YoY) పోలిస్తే ఇది 8.7 శాతం వృద్ధి. QoQలోనూ 2.4 శాతం పెరిగింది. ఈ టెక్ మేజర్ రూ. 59,692 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని గడించింది. YoYలో 8 శాతం, QoQలో 0.5 శాతం పెరిగింది. డాలర్ల లెక్కన, ఆదాయం 7210 మిలియన్ డాలర్లుగా నమోదైంది.
రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.9 చొప్పున డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది, ఈ నెల 19ని రికార్డు తేదీగా ఖరారు చేసింది. రూ.17,000 కోట్ల షేర్స్ బైబ్యాక్‌ను కూడా టీసీఎస్ ప్రకటించింది. ఒక్కో షేరును రూ.4,150 ధరతో మొత్తం 4.09 కోట్ల షేర్లు (కంపెనీలో 1.12% వాటాకు సమానం) బైబ్యాక్ చేయాలని నిర్ణయించింది.
డెల్టా కార్ప్: సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో, ఏకీకృత నికర లాభంలో కేవలం 2% వృద్ధిని నమోదు చేసి రూ. 69.4 కోట్లకు చేరుకుంది.
ఇన్ఫోసిస్, HCL టెక్: ఈ రెండు టెక్ కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. కాబట్టి, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్ షేర్ల మీద ఈ రోజు మార్కెట్ ఫోకస్ ఉంటుంది.
గ్రాసిమ్: రైట్స్ ఇష్యూ లేదా ఇతర ప్రాధాన్యత పద్ధతుల ద్వారా ఈక్విటీ షేర్లను జారీ చేసి నిధుల సమీకరించే ప్రతిపాదనను పరిశీలించేందుకు గ్రాసిమ్ బోర్డ్ ఈ నెల 16న సమావేశం అవుతుంది.
ఇండస్ఇండ్ బ్యాంక్: ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో 9.99% పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌ను తీసుకునేందుకు SBI మ్యూచువల్ ఫండ్‌ను రిజర్వ్ బ్యాంక్ అనుమతించింది.
సిప్లా: ఈ కంపెనీ అనుబంధ సంస్థ ఇన్వాజెన్ ఫార్మాస్యూటికల్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను తనిఖీ చేసిన US FDA, వాలంటరీ యాక్షన్ ఇండికేట్ (VAI) రిపోర్టును అందుకుంది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్: అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన NCDలను కేటాయించి, రూ.700 కోట్లు సమీకరించింది.
పతంజలి ఫుడ్స్: ఎడిబుల్ ఆయిల్ అమ్మకాల వాల్యూమ్‌లో సింగిల్ డిజిట్ గ్రోత్ నమోదు చేసుకున్నట్లు పతంజలి ఫుడ్స్ తెలిపింది. ఫుడ్ & FMCG విభాగంలో, Q2లో రెండంకెల QoQ వృద్ధిని సాధించింది.
జాంగిల్ ప్రీపెయిడ్: సెప్టెంబర్ త్రైమాసికంలో జాంగిల్ ప్రీపెయిడ్ PAT 67% తగ్గి రూ.20.6 కోట్లకు పరిమితమైంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 34% పెరిగి రూ.1,185 కోట్లకు చేరుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: నంబర్ లేని క్రెడిట్ కార్డును చూశారా?, యాక్సిస్ బ్యాంక్ లాంచ్ చేసింది
Join Us on Telegram: https://t.me/abpdesamofficial