Stock Market Today, 12 June 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 7.55 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 70 పాయింట్లు లేదా 0.38 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,680 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ గ్యాప్‌ అప్‌లో ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


CMS ఇన్ఫో సిస్టమ్స్‌: ఈ కంపెనీ ప్రమోటర్ గ్రూప్‌లో ఒకటైన సింగపూర్‌కు చెందిన సియోన్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్, శుక్రవారం నాడు బల్క్ డీల్స్ ద్వారా CMS ఇన్ఫో సిస్టమ్స్‌లో దాదాపు 13.7% వాటాను ఆఫ్‌లోడ్ చేసింది.


TVS మోటార్: స్విట్జర్లాండ్‌కు చెందిన స్విస్ ఈ-మొబిలిటీ గ్రూప్ SEMGలో మరో 25% వాటాను TVS మోటార్ అనుబంధ సంస్థ TVS మోటార్ (సింగపూర్) ప్రైవేట్‌ లిమిటెడ్‌ కొనుగోలు చేయబోతోంది. ప్రస్తుతం ఉన్న వాటాదార్ల నుంచి ఈ స్టేక్‌ కొనుగోలు చేయనుంది.


SBI: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డెట్ ఇన్‌స్ట్రుమెంట్ల ద్వారా రూ. 50 వేల కోట్ల వరకు సమీకరించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది.


కొచ్చిన్ షిప్‌యార్డ్: ఇండియన్ నేవల్ షిప్ మిడ్-లైఫ్ అప్‌గ్రేడ్ కోసం ఇండియన్ నేవీ పిలిచిన బిడ్స్‌లో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) అత్యల్ప బిడ్డర్‌గా నిలిచింది.


బ్లూ డార్ట్: వీఎన్ అయ్యర్‌ను గ్రూప్ CFOగా బ్లూ డార్ట్‌ నియమించింది. గతంలో, అయ్యర్ ఐదేళ్ల పాటు బ్లూ డార్ట్ ఏవియేషన్‌లో CFOగా పని చేశారు.


జూపిటర్‌ వాగన్స్‌: కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ కింద, స్టోన్ ఇండియా లిమిటెడ్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు జూపిటర్ వ్యాగన్స్ సమర్పించిన రిజల్యూషన్ ప్లాన్‌ను NCLT ఆమోదించింది.


గతి: గతి మాతృ సంస్థ ఆల్‌కార్గో లాజిస్టిక్స్, గతి-కింటెట్సు ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 30% వాటాను కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది.


ఇండస్ఇండ్ బ్యాంక్: నాగ్‌పుర్‌ నగరంలో 15వ శాఖను ప్రారంభించిన ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరించింది.


GHCL: గుజరాత్ హెవీ కెమికల్స్ లిమిటెడ్‌, తన సోడా యాష్ ప్లాంట్‌లోని లైమ్ బట్టీల్లోని మెకానికల్ బ్రేక్‌డౌన్ సంఘటనపై అప్‌డేట్ ఇచ్చింది. మెకానికల్ బ్రేక్‌డౌన్ సమస్యను విజయవంతంగా పరిష్కరించామని, సోడా యాష్ ఉత్పత్తి తిరిగి సాధారణ స్థాయికి చేరుకుందని కంపెనీ ప్రకటించింది.


పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్: నిధుల సమీకరణ ప్రతిపాదనను పరిశీలించేందుకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్‌ నేడు సమావేశం కానుంది. దీంతో మార్కెట్‌ దృష్టి ఈ బ్యాంక్‌ షేర్లపై ఉంటుంది.


ఇది కూడా చదవండి: సీనియర్‌ సిటిజెన్స్‌ - ఇలా చేస్తే ఆరోగ్య బీమా రిజెక్ట్‌ అవ్వదు! 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.