Stock Market Today, 09 May 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 32 పాయింట్లు లేదా 0.17 శాతం రెడ్‌ కలర్‌లో 18,318 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌/ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: లుపిన్, అపోలో టైర్స్, వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్, రేమండ్, నజారా టెక్. ఈ కంపెనీల షేర్లపై మార్కెట్‌ దృష్టి ఉంటుంది.


ఆర్తీ ఇండస్ట్రీస్: 2023 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఆర్తీ ఇండస్ట్రీస్ రూ. 149 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా, కార్యకలాపాల ద్వారా రూ. 1,656 కోట్ల ఆదాయం వచ్చింది.


పిడిలైట్ ఇండస్ట్రీస్‌: 2022-23 చివరి త్రైమాసికంలో పిడిలైట్ ఇండస్ట్రీస్ రూ. 283 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా, కార్యకలాపాల ద్వారా రూ. 2,689 కోట్ల ఆదాయం వచ్చింది.


మహానగర్ గ్యాస్: నాలుగో త్రైమాసికానికి మహానగర్ గ్యాస్ లాభం రూ. 268 కోట్లుగా ఉంది. ఇదే కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1,610 కోట్లుగా ఉంది.


బిర్లాసాఫ్ట్: బిర్లాసాఫ్ట్ పుంజుకుంది. 2022 డిసెంబర్ త్రైమాసికంలో వచ్చిన రూ. 16.3 కోట్ల నష్టం నుంచి కోలుకుని, 2023 మార్చి త్రైమాసికంలో రూ.112 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా రూ. 1,226 కోట్ల ఆదాయం వచ్చింది.


కాన్సాయ్ నెరోలాక్: కన్సాయ్ నెరోలాక్ జనవరి-మార్చి కాలంలో రూ. 94 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఆ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1,733 కోట్లుగా ఉంది.


కల్పతరు పవర్‌: 2023 మార్చి త్రైమాసికంలో కల్పతరు పవర్ నికర లాభం 46% పెరిగి రూ. 156 కోట్లకు చేరుకుంది. అదే కాలంలో కార్యకలాపాల ద్వారా రూ. 4,882 కోట్ల ఆదాయం వచ్చింది.


ఆంధ్ర పేపర్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఆంధ్ర పేపర్ రూ. 154 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ. 590 కోట్లుగా ఉంది.


కార్బోరండమ్ యూనివర్సల్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో కార్బోరండమ్ యూనివర్సల్ నికర లాభం రెట్టింపునకు పైగా పెరిగి రూ. 137 కోట్లకు చేరుకుంది.


VIP ఇండస్ట్రీస్‌: మార్చితో ముగిసిన త్రైమాసికంలో VIP ఇండస్ట్రీస్ రూ. 4.3 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. ఈ త్రైమాసికంలో ఆదాయం రూ. 451 కోట్లుగా ఉంది.


అపోలో పైప్స్‌: నాలుగో త్రైమాసికంలో అపోలో పైప్స్ రూ. 15 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా, ఆదాయం రూ. 252 కోట్లుగా ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.