Stocks to watch today, 06 April 2023: ఇవాళ (గురువారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 36 పాయింట్లు లేదా 0.20 శాతం రెడ్‌ కలర్‌లో 17,577 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


DMart: డీమార్ట్‌ బ్రాండ్‌తో రిటైల్ చైన్ నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ (Avenue Supermarts), 2023 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి రూ. 10,337 కోట్ల స్వతంత్ర ఆదాయాన్ని నివేదించింది.


ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: రూ. 25,000 కోట్ల మైలురాయిని చేరుకునే దిశగా, 2023 మార్చి త్రైమాసికంలో బ్యాంక్ డిపాజిట్లలో 39% బలమైన వృద్ధి కొనసాగింది. స్థూల అడ్వాన్సులు ఏడాది ప్రాతిపదికన (YoY) 33% పెరిగి రూ. రూ. 28,061 కోట్లకు చేరాయి. QoQ 13% వృద్ధి కనిపించింది.


RVNL: నార్త్ సెంట్రల్ రైల్వేస్‌ నుంచి రూ. 121 కోట్ల విలువైన ప్రాజెక్ట్ కోసం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) అత్యల్ప బిడ్డర్‌గా నిలిచింది.


Nykaa: ప్రముఖ బ్యూటీ ప్రొడక్ట్స్ బ్రాండ్ Nykaa పేరుతో బిజినెస్‌ చేస్తున్న ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈ-కామర్స్ (FSN E-Commerce), ఇండస్ట్రీ ట్రెండ్‌ స్తబ్దుగా ఉన్నప్పటికీ, మార్చితో ముగిసిన త్రైమాసికంలో బలమైన వ్యాపార వృద్ధిని సాధించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 30% ఆదాయ వృద్ధిని ఈ కంపెనీ అంచనా వేస్తోంది.


గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌: ఏకీకృత ప్రాతిపదికన, నాలుగో త్రైమాసికంలో మధ్య ఏక అంకె (mid single digit) అమ్మకాల వృద్ధిని, రూపాయి పరంగా రెండంకెల వృద్ధిని సాధిస్తామని గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌ భావిస్తోంది.


సైయెంట్: సయెంట్‌ అనుబంధ సంస్థ సైయెంట్‌ DLM, ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌ను (IPO) ప్రారంభించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI నుంచి అనుమతి పొందింది.


చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్: నాలుగో త్రైమాసికంలో కంపెనీ డిస్‌బర్స్‌మెంట్స్‌ రూ. 21,020 కోట్లుగా ఉన్నాయి, గత ఏడాది ఇదే కాలంలోని రూ. 12,718 కోట్లతో పోలిస్తే ఇప్పుడు 65% వృద్ధి కనిపిస్తోంది.


వేదాంత: గతంలో ప్రకటించిన రూ. 20.5 మధ్యంతర డివిడెండ్‌కు సంబంధించి వేదాంత షేర్లు ఈరోజు ఎక్స్-డివిడెండ్‌లో ట్రేడ్ అవుతాయి.


హీరో మోటోకార్ప్: హీరో మోటోకార్ప్ తన సిబ్బంది కోసం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (VRS) ప్రారంభించినట్లు ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. కంపెనీ సామర్థ్యాన్ని ఈ పథకం మరింత మెరుగుపరుస్తుందని ఆశిస్తోంది.


రిలయన్స్ రిటైల్: ఓమ్నిచానెల్ బ్యూటీ రిటైల్ ప్లాట్‌ఫామ్ 'తిరా' (Tira)ను రిలయన్స్ రిటైల్‌ ప్రారంభించింది, తద్వారా బ్యూటీ సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది.


LIC: FY24లో రూ. 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని ఎల్‌ఐసీ యోచిస్తోంది, దానిలో 30% ఈక్విటీ షేర్ల కోసం కేటాయిస్తుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.