Stock Market Today, 03 October 2023: యూరోపియన్, ఆసియా మార్కెట్ల సహకారంతో ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు గత వారం హైయ్యర్ సైడ్ ముగిశాయి. ఈ వారంలో, నెలవారీ అమ్మకాల నంబర్ల కారణంగా ఆటో స్టాక్స్ ఫోకస్‌లో ఉంటాయి. ఈ వారం RBI పాలసీ మీటింగ్ కూడా ఉంది, మార్కెట్ డైరెక్షన్‌ను ఇది డిసైడ్ చేస్తుంది.
ఇవాళ ఉదయం 8.30 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 45.5 పాయింట్లు లేదా 0.23 శాతం రెడ్ కలర్‌లో 19,568 వద్ద ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఇండస్ఇండ్ బ్యాంక్: సెప్టెంబర్ 30, 2023 నాటికి ఇండస్‌ఇండ్ బ్యాంక్ నికర అడ్వాన్స్‌లు రూ. 3,14,928 కోట్లుగా లెక్క తేలింది. త్రైమాసిక ప్రాతిపదికన ఇది రూ. 3,01,317 కోట్ల నుంచి 5% పెరిగింది, వార్షిక ప్రాతిపదికన రూ. 2,60,129 కోట్ల నుంచి 21% పెరిగింది.
కోల్ ఇండియా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో, కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) 333 మిలియన్ టన్నుల (MTs) బొగ్గును ఉత్పత్తి చేసింది. ఇది, బలమైన 11.3% వార్షిక వృద్ధి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలం కంటే ఇది దాదాపు 34 MTలు ఎక్కువ. 2023 సెప్టెంబర్‌లో ఉత్పత్తి 5.8 MTలు లేదా 12.6% పెరిగి 51.4 MTలకు చేరుకుంది. గత ఏడాది ఇదే నెలలో కోల్ ఇండియా 45.7 MTలను ఉత్పత్తి చేసింది.
హిందుస్థాన్ జింక్: FY24 రెండో త్రైమాసికంలో, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్ 2,52,000 టన్నుల ముడి మెటల్ ఉత్పత్తి చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉత్పత్తి చేసిన 2,55,000 టన్నుల నుంచి ఒక శాతం తగ్గింది. నిర్వహణ పనుల కారణంగా, రిఫైన్డ్ మెటల్ ఉత్పత్తి Q2FY24లో 2% YoY తగ్గి 241 ktకి పడిపోయింది. సమీక్ష కాలంలో, ఇంటిగ్రేటెడ్ జింక్ ఉత్పత్తి 185 kt గా నమోదైంది. ఇది, YoY 2%, QoQ 12% తగ్గింది.
అదానీ ఎనర్జీ సొల్యూషన్స్: ఖర్ఘర్ విఖ్రోలి ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌లో (KVTL) కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇది ముంబైకి అదనపు విద్యుత్‌ను డెలివరీ చేస్తుంది. నగరంలో పెరుగుతున్న, భవిష్యత్తు ఇంధన డిమాండ్‌ను తీర్చడంలోనూ సాయపడుతుంది.
TVS మోటార్ కంపెనీ: సెప్టెంబర్ 2022లోని విక్రయాలు 3,79,011 యూనిట్లతో పోలిస్తే, సెప్టెంబర్ 2023లో 4,02,553 యూనిట్ల అమ్మకాలతో TVS మోటార్ కంపెనీ Q2FY24లో 6% వృద్ధిని సాధించింది. సెప్టెంబర్ 2022లో అమ్మకాలు 3,61,729 యూనిట్ల నుంచి సెప్టెంబర్ 2023లో 3,86,955 యూనిట్లకు పెరిగిన విక్రయాలతో మొత్తం టూవీలర్ రంగంలో 7% విస్తరణ సాధించింది.
హీరో మోటోకార్ప్: ప్రపంచంలోనే అతి పెద్ద మోటార్‌సైకిళ్లు & స్కూటర్‌ల ఉత్పత్తి సంస్థ హీరో మోటోకార్ప్, సెప్టెంబర్ 2023లో 5,36,499 యూనిట్లను విక్రయించింది. సెప్టెంబర్ 2022లోని 5,19,980 యూనిట్లను విక్రయాలతో పోలిస్తే, ఈ కంపెనీ 3% పైగా వృద్ధిని సాధించింది.
టాటా మోటార్స్: Q2 FY 2022-23లో టాటా మోటార్స్ లిమిటెడ్ దేశీయ & విదేశీ మార్కెట్లలో 2,43,387 యూనిట్లను విక్రయించింది. ఇప్పుడు, Q2 FY 2023-24లో 2,43,024 వాహనాలను అమ్మింది.
మారుతీ సుజుకి: సెప్టెంబర్ 2023లో, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మొత్తం 1,81,343 యూనిట్లను విక్రయించింది. ఇందులో... 1,53,106 యూనిట్ల దేశీయ అమ్మకాలు, OEMలకు 5,726 యూనిట్ల అమ్మకాలు, 22,511 యూనిట్ల ఎగుమతులు ఉన్నాయి. ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ కంపెనీ మొత్తం 10,50,085 యూనిట్లను విక్రయించింది. కంపెనీ మొదటిసారిగా 1 మిలియన్ యూనిట్ల అర్ధ-వార్షిక విక్రయాలను అధిగమించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.