Stocks to watch today, 31 October 2022: ఇవాళ (సోమవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 193.5 పాయింట్లు లేదా 1.08 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,028 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ Q2 ఫలితాలు ప్రకటించనున్న మేజర్‌ కంపెనీలు: 3i ఇన్ఫోటెక్, అసాహి ఇండియా గ్లాస్, భారతి ఎయిర్‌టెల్, క్యాస్ట్రోల్ ఇండియా, LT ఫుడ్స్, లార్సెన్ అండ్ టుబ్రో, సారెగమా ఇండస్ట్రీస్, స్వరాజ్ ఇంజిన్స్, టాటా స్టీల్, VST టిల్లర్స్, మోల్డ్-టెక్, TCI ఎక్స్‌ప్రెస్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, మదర్సన్ సుమీ


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


వేదాంత: సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో అధిక వ్యయాల వల్ల ఏకీకృత నికర లాభం 60.8 శాతం క్షీణించి రూ.1,808 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.4,615 కోట్లుగా ఉంది.


మారుతి సుజుకి: సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ ఆటోమొబైల్‌ మేజర్ ఏకీకృత నికర లాభం నాలుగు రెట్లు పెరిగి రూ. 2,112.5 కోట్లకు చేరింది, రికార్డు స్థాయి అమ్మకాలు సాధించింది.


లుపిన్: లుపిన్‌కు చెందిన నాగ్‌పూర్ యూనిట్-2 ఇంజెక్టబుల్ తయారీ కేంద్రాన్ని US FDA తనిఖీ చేసింది. ఇంజెక్షన్ ఫెసిలిటీ ప్రి-అప్రూవల్ ఇన్‌స్పెక్షన్ (PAI) ఇది. ఐదు పరిశీలనలతో కూడిన ఫారం-483 US FDA జారీ చేసింది. 


NTPC: సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజం ఏకీకృత నికర లాభం 7 శాతం పైగా క్షీణించింది. రూ. 3,417.67 కోట్ల లాభాన్ని మిగుల్చుకుంది. ప్రధానంగా అధిక ఖర్చులు లాభాన్ని తగ్గించాయి. సెప్టెంబర్ 30, 2021తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.3,690.95 కోట్లుగా ఉంది.


హిందుస్థాన్ కాపర్: క్రెడిట్ రేటింగ్ సంస్థ ICRA, హిందూస్థాన్‌ కాపర్‌ దీర్ఘకాలిక రేటింగ్‌ను AA+ వద్ద, స్వల్పకాలిక రేటింగ్‌ను A1+ వద్ద కొనసాగించింది. 


బ్లూ డార్ట్: 2022-23 రెండో త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.1,325 కోట్ల మొత్తం ఆదాయంతో, 17.95 శాతం వృద్ధిని నమోదు చేసింది. Q2FY23లో నికర లాభ మార్జిన్ 7.07 శాతంగా ఉంది. ఇది Q2FY22లో 8.06 శాతం, Q1FY23లో 9.18 శాతం కంటే తక్కువగా ఉంది.


జైడస్‌ లైఫ్‌సైన్సెస్: ఎసిటమినోఫెన్ ఇంజెక్షన్‌కు సంబంధించి, 1,000 mg/100mL (10 mg/mL) సింగిల్ డోస్ వయల్స్‌ను అమెరికాలో మార్కెట్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నుంచి తుది ఆమోదం పొందింది.


లారస్ ల్యాబ్స్: ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంలోని పరవాడలో ఉన్న యూనిట్-5లో ప్రి-అప్రూవల్ ఇన్‌స్పెక్షన్ (PAI)ను US FDA  పూర్తి చేసింది. ఒక పరిశీలనతో ఫారం 483 జారీ చేసింది.


హీరో మోటోకార్ప్: ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. పండుగ సీజన్‌లో రిటైల్ విక్రయాలు 20% పెరిగాయని, దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో తమ నాయకత్వాన్ని పటిష్టం చేసుకునేందుకు వీలు కలిగిందని హీరో మోటోకార్ప్ తెలిపింది.


డా.రెడ్డీస్ ల్యాబ్స్: సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.1,114 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని కంపెనీ సాధించింది, గత సంవత్సరం ఇదే కాలం కంటే ఇది దాదాపు 12% వృద్ధి. ఏకీకృత ఎబిటా YoYలో దాదాపు 40% పెరిగి రూ.1,899 కోట్లకు చేరుకుంది. నిర్వహణ మార్జిన్ 651 బేసిస్ పాయింట్లు పెరిగి 29.99 శాతానికి చేరుకుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.