Stocks to watch today, 23 March 2023: ఇవాళ (గురువారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 54 పాయింట్లు లేదా 0.31 శాతం రెడ్‌ కలర్‌లో 17,104 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:          


HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో (HAL) 3.5% వాటాను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా కేంద్ర ప్రభుత్వం విక్రయించనుంది. OFS ఫ్లోర్ ధర ఒక్కో షేరుకు రూ. 2,450గా నిర్ణయించింది. 


కోరమాండల్ ఇంటర్నేషనల్: కోరమాండల్ ఇంటర్నేషనల్ స్పెషాలిటీ, ఇండస్ట్రియల్ కెమికల్స్‌లోకి అడుగు పెడుతోంది. దీంతో పాటు CDMOలోకి (Contract Development and Manufacturing Organization) అడుగు పెట్టడం, పంట రక్షణ రసాయనాల విస్తరణ గురించి కూడా ప్రకటించింది.


నజారా టెక్నాలజీస్: USకు చెందిన ప్రో ఫుట్‌బాల్ నెట్‌వర్క్‌ను (Pro Football Network) కొనుగోలు చేస్తున్నట్లు నజారా టెక్నాలజీస్‌ అనుబంధ సంస్థ అయిన Sportskeeda ప్రకటించింది.           


పవర్‌ గ్రిడ్‌: గుజరాత్‌లో ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి SPV ప్రాజెక్ట్ అయిన ఖవ్దా RE ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌ను పవర్‌ గ్రిడ్‌ కొనుగోలు చేసింది.            


హీరో మోటోకార్ప్: ఎంపిక చేసిన మోటార్‌ సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలను హీరో మోటోకార్ప్‌ పెంచింది, కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి.       


బాష్‌: జులై 1 నుంచి అమలులోకి వచ్చేలా కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా గురుప్రసాద్ ముద్లాపూర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సందీప్ నెలమంగళను బోర్డు నియమించింది.      


BHEL: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL), ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) కలిసి టైప్-IV సిలిండర్ల అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్‌ కోసం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.


రిలయన్స్ ఇండస్ట్రీస్‌: రిలయన్స్ రిటైల్‌కు చెందిన FMCG విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, తన పోర్ట్‌ఫోలియోలోని గృహ & వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను ఇంకా విస్తరించింది. ఇది స్నానం, పరిశుభ్రత, లాండ్రీ, గృహ సంరక్షణ ఉత్పత్తుల్లో బ్రాండ్‌లను లాంచ్‌ చేసింది. 


KEC ఇంటర్నేషనల్: భారతదేశంలో ప్రసార & పంపిణీ ప్రాజెక్ట్‌ల కోసం రూ. 1,560 కోట్ల కొత్త ఆర్డర్‌లను పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి KEC ఇంటర్నేషనల్ దక్కించుకుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.