Stocks to watch today, 23 December 2022: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 107 పాయింట్లు లేదా 0.57 శాతం రెడ్‌ కలర్‌లో 18,071 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


ల్యాండ్‌మార్క్ కార్స్‌: కార్ రిటైలర్, సర్వీస్ ప్రొవైడర్ ఇవాళ (శుక్రవారం, 23 డిసెంబర్‌ 2022) మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. 2022 డిసెంబరు 13-15 తేదీల మధ్య జరిగిన IPOలో రూ. 481-506 ప్రైస్‌ రేంజ్‌లో షేర్లను విక్రయించింది, రూ. 552 కోట్లను సమీకరించింది. ఈ ఇష్యూ మొత్తం మూడు రెట్లకు పైగా సబ్‌స్క్రైబ్ అయింది.


అబాన్స్ హోల్డింగ్స్: 2022 డిసెంబరు 12-15 తేదీల మధ్య రూ. 345.6 కోట్ల ప్రైమరీ ఆఫర్‌ను అమలు చేసిన ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లేయర్, ఇవాళ బోర్స్‌లో లిస్ట్‌ అవుతోంది. ఈ కంపెనీ, రూ. 256-270 మధ్య ఒక్కో షేరును పబ్లిక్‌ ఇష్యూలో విక్రయించింది. ఈ ఇష్యూకు అంతంత మాత్రంగా స్పందన వచ్చింది.


ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్: ఈ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకి అత్యంత భారీ స్పందన వచ్చింది. ఈ ఇష్యూ 243.7 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది, ఇవాళ BSE SME ప్లాట్‌ఫామ్‌లో లిస్ట్‌ అవుతుంది. ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ. 34 కోట్లను సేకరించేందుకు, తన షేర్లను ఒక్కొక్కటి రూ. 54 చొప్పున విక్రయించింది. 2022 డిసెంబర్ 13-15 తేదీల మధ్య ఈ IPO కొనసాగింది.


రిలయన్స్ ఇండస్ట్రీస్: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని 'రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్' (Reliance Strategic Business Ventures), అమెరికా కేంద్రంగా పని చేసే ఎక్సిన్ టెక్నాలజీస్ ఇంక్‌లో (Exyn Technologies Inc) 23.3 శాతం వాటాను $25 మిలియన్లకు కొనుగోలు చేసింది. GPS లేదా ఇతర నావిగేషన్ టెక్నాలజీలు లేకుండా క్లిష్టమైన ప్రాంతాల్లో డ్రోన్‌లు, రోబోట్‌లను స్వతంత్రంగా నావిగేట్‌ చేసే సాంకేతిక సంస్థ.


విప్రో: విప్రో ఓపస్‌ రిస్క్‌ సొల్యూషన్స్‌లో (Wipro Opus Risk Solutions‌) తనకున్న వాటాను విప్రో పూర్తి స్థాయి అనుబంధ సంస్థ అయిన విప్రో గల్లాఘెర్‌ సొల్యూషన్స్‌ (Wipro Gallagher Solutions) విక్రయించింది. ఈ లావాదేవీ ద్వారా, ఇతర అనుబంధ సంస్థల ద్వారా ప్రధాన తనఖా వ్యాపారాన్ని తన వద్దే ఉంచుకుంటూ, నాన్ కోర్ తనఖా వ్యాపారాన్ని మాత్రమే విప్రో గల్లాఘెర్‌ ఉపసంహరించుకుంది.


NTPC: బొగ్గు ఆధారిత యూనిట్ల నుంచి కర్బన ఉద్గారాలను తగ్గించడానికి GE పవర్ ఇండియా లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. యూనిట్ల వద్ద కాల్చే బొగ్గు పరిమాణాన్ని తగ్గించే పరిశోధన, అభివృద్ధి, ఇంజినీరింగ్‌లో భాగస్వామ్యం చేయడం ఈ ఒప్పందం లక్ష్యం.


యెస్ బ్యాంక్: డిష్ టీవీ, ఏషియన్ హోటల్స్ (నార్త్), అవంత రియాల్టీ సహా ఏడు కంపెనీల తనఖా షేర్లను JC ఫ్లవర్స్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్‌కు యెస్‌ బ్యాంక్‌ బదిలీ చేసింది. రూ. 48,000 కోట్లకు పైగా మొండి బకాయిల బదిలీలో ఇది ఒక భాగం.


ఇండియన్ హోటల్స్ కంపెనీ: టాటా గ్రూప్‌లోని ఈ హోటల్ ప్లేయర్, పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్, అసన్సోల్‌లో రెండు జింజర్ బ్రాండ్ హోటళ్ల కోసం సంతకం చేసింది. దుర్గాపూర్, అసన్సోల్‌లు తయారీ పరిశ్రమలకు ప్రధాన కేంద్రాలు. ఈ రెండు ఒప్పందాలు ఆ రాష్ట్రంలో కంపెనీ ఉనికిని బలోపేతం చేస్తాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.