Stocks to watch today, 20 October 2022: ఇవాళ (గురువారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 137.5 పాయింట్లు లేదా 0.79 శాతం రెడ్ కలర్‌లో 17,366 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ Q2 ఫలితాలు ప్రకటించనున్న మేజర్ కంపెనీలు: బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, ఏసియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, కెనరా బ్యాంక్, యునైటెడ్ బ్రూవరేజ్, కాల్గెట్ పామోలివ్, యంఫసిస్, యూనియన్ బ్యాంక్, శ్రీరామ్ చిట్స్, డిక్సన్ కోఫోర్జ్, KEI ఇండస్ట్రీస్, సింఫనీ, ఇండియా మార్ట్, జీ మీడియా, IEX, జూబిలెంట్ ఇంగ్రీవియా, ICICI సెక్యూరిటీస్, IIFL సెక్యూరిటీస్, తాన్లా ఫ్లాట్‌ఫామ్స్, క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియా మార్ట్, Lత&T ఫైనాన్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లక్ష్మీ మెషీన్ వర్క్స్, జెన్సార్ టెక్నాలజీస్, నజారా టెక్నాలజీస్.
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
హావెల్స్ ఇండియా: ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికానికి రూ. 187 కోట్ల పన్ను తర్వాతి లాభాన్ని (PAT) పోస్ట్ చేసింది. ఇవాళ మార్కెట్ దృష్టి దీని మీద ఉంటుంది.
ఇండస్‌ఇండ్ బ్యాంక్: బుధవారం, 2022 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 1,787 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. నికర లాభంలో గత సంవత్సరం కంటే 60.4 శాతం (YoY) పెరుగుదలను నివేదించింది. ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం దాదాపు 18 శాతం పెరిగి రూ. 4,302 కోట్లకు చేరింది.
ఏంజెల్ వన్: ఏంజెల్ వన్ ఒక్కో షేరుకు రూ. 9 డివిడెండ్ ప్రకటించిన నేపథ్యంలో, దానికి సంబంధించి ఇవాళ ఎక్స్ డేట్.
ఏషియన్ పెయింట్స్: ఏషియన్ పెయింట్స్ తన త్రైమాసిక సంఖ్యలను ఇవాళ ప్రకటించనుంది. ధరల పెంపుతో పాటు మార్కెట్ వాటాలో నిరంతర వృద్ధితో లాభాల కారణంగా, అమ్మకాలలో రెండంకెల వృద్ధిని ఈ పెయింట్ తయారీ సంస్థ నమోదు చేయవచ్చని భావిస్తున్నారు.
బజాజ్ ఫైనాన్స్: బజాజ్ ఫైనాన్స్ కూడా ఈ రోజు తన త్రైమాసిక సంఖ్యలను ప్రకటించనుంది.
ITC: ఈరోజు Q2 ఫలితాలను వెల్లడించనున్నందున, ఈ కంపెనీ షేర్లు ఫుల్ ఫోకస్‌లో ఉంటాయి. అన్ని వ్యాపారాల్లో స్థిరమైన పనితీరు, సిగరెట్ వ్యాపారం వాల్యూమ్స్‌లో నిరంతర వృద్ధి నేపథ్యంలో ఈ కంపెనీ బలమైన సంఖ్యలను నివేదించవచ్చని మార్కెట్ అంచనా వేసింది.
నిప్పాన్ లైఫ్: ఈ కంపెనీ బుధవారం తన సెప్టెంబర్ త్రైమాసిక ఆదాయాలను విడుదల చేసింది. కంపెనీ పన్ను తర్వాతి లాభం (PAT) రూ. 206 కోట్లకు చేరుకోగా, ఆదాయం రూ. 332 కోట్లుగా ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.