Stocks to watch today, 17 October 2022: ఇవాళ (సోమవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 135.5 పాయింట్లు లేదా 0.79 శాతం రెడ్ కలర్‌లో 17,077.5 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ Q2 ఫలితాలు ప్రకటించనున్న మేజర్ కంపెనీలు: ACC, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, PVR, కెన్ ఫిన్ హోమ్స్, క్రాఫ్ట్స్‌మాన్ ఆటోమేషన్, మహారాష్ట్ర సీమ్‌లెస్, హైడెల్‌బర్గ్ సిమెంట్ ఇండియా, స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్, టాటా కాఫీ, ఛాయిస్ ఇంటర్నేషనల్, టాటా మెటాలిక్స్, ఓరియంటల్ హోటల్స్
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా (EMI): ఈ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ షేర్లు ఇవాళ స్టాక్ మార్కెట్లలో అరంగేట్రం చేస్తున్నాయి. ఈ నెల 4-7 తేదీల మధ్య జరిగిన IPO ద్వారా ఒక్కో షేరును రూ.59 చొప్పున ఈ కంపెనీ విక్రయించింది. తద్వారా రూ.500 కోట్ల వరకు సమీకరించింది. లిస్టింగ్‌కు గ్రే మార్కెట్‌లో బలమైన ప్రీమియంతో షేర్లు చేతులు మారాయి.
HDFC బ్యాంక్: సెప్టెంబర్ త్రైమాసికంలో, అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఏకీకృత నికర లాభం 22.30 శాతం పెరిగి రూ.11,125.21 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.9,096.19 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది.
బజాజ్ ఆటో: సెప్టెంబర్ త్రైమాసికంలో, ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏకీకృత నికర లాభం 16 శాతం క్షీణించి రూ.1,719 కోట్లకు చేరుకుంది. విదేశీ ఎగుమతుల్లో 25 శాతం క్షీణత వల్ల లాభం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.2,040 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఈ కంపెనీ నమోదు చేసింది.
అవెన్యూ సూపర్‌మార్ట్స్: డి మార్ట్ పేరుతో రిటైల్ బిజినెస్ చేస్తున్న ఈ కంపెనీ సగటు బాస్కెట్ విలువ పెరగడంతో, FY23 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.685.71 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నివేదించింది. ఇది 64.13 శాతం వృద్ధి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.417.76 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్: అదానీ గ్రూప్‌లోని ఈ ఫ్లాగ్‌షిప్ కంపెనీ, కోల్‌కతాకు చెందిన అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ & మెషిన్ లెర్నింగ్ కంపెనీ అయిన 'సిబియా అనలిటిక్స్ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్'ను (SIBIA Analytics and Consulting Services) కొనుగోలు చేయబోతోంది. ఎంత మొత్తానికి డీల్ కుదిరిందో వెల్లడించలేదు.
శ్రీ సిమెంట్: పెరిగిన విద్యుత్, ఇంధన ధరల ప్రభావంతో, 2022 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ సిమెంట్ కంపెనీ ఏకీకృత నికర లాభం 67.5 శాతం క్షీణించి రూ.183.24 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.563.94 కోట్లుగా ఉంది.
అలోక్ ఇండస్ట్రీస్: 2022-23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో, ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ కంపెనీ ఏకీకృత నికర నష్టం రెట్టింపు పైగా పెరిగి రూ.191.50 కోట్లకు చేరింది. గత ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.84.11 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది.
దిలీప్ బిల్డ్‌కాన్: ఈ రోడ్డు నిర్మాణ సంస్థ గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి రూ.702 కోట్ల విలువైన ప్రాజెక్టును దక్కించుకుంది. ఈ ప్రాజెక్టును 26 నెలల్లో పూర్తి చేయాలి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.