Stocks to watch today, 15 March 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 96 పాయింట్లు లేదా 0.56 శాతం గ్రీన్‌ కలర్‌లో 17,207 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ గ్యాప్‌ అప్‌లో ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


రిలయన్స్ ఇండస్ట్రీస్: మెట్రో ఏజీ వ్యాపారాన్ని రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) నుంచి ఆమోదం లభించింది.


NBCC: కరైకల్‌లో మెడికల్ కాలేజీ, ఆసుపత్రి నిర్మాణానికి పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి NBCC ఒక ఆర్డర్ పొందింది. ఆర్డర్ విలువ రూ.500 కోట్లు.


డివ్గీ టార్క్ ట్రాన్స్‌ఫర్‌: మంగళవారం లిస్ట్‌ అయిన డివ్గీ టార్క్ ట్రాన్స్‌ఫర్‌లో, దాదాపు 3.73 లక్షల షేర్లను బ్లాక్ డీల్ ద్వారా దాదాపు రూ. 22 కోట్లకు మోర్గాన్ స్టాన్లీ విక్రయించింది. ఒక్కో షేరును రూ. 590.32 చొప్పున అమ్మింది.


సిప్లా: ఉగాండాలోని క్వాలిటీ కెమికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో (CQCIL) తనకున్న 51.8% వాటాను ఆఫ్రికా క్యాపిటల్‌వర్క్స్ SSA 3కి $25-30 మిలియన్లకు సిప్లా విక్రయించింది.


రైల్‌టెల్: న్యూదిల్లీ, బెంగళూరులోని గ్రీన్ ఫీల్డ్ డేటా సెంటర్‌లో ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరఫరా, ఇన్‌స్టాలేషన్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్, ప్రారంభం, శిక్షణ, మద్దతు కార్యకలాపాల కోసం 'సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్' (C-DAC) నుంచి రైల్‌టెల్ కార్పొరేషన్ ఆర్డర్‌ గెలుచుకుంది. ఆర్డర్‌ విలువ రూ. 287.57 కోట్లు.              


స్టార్ హెల్త్: తన రెగ్యులర్ అసెస్‌మెంట్ ప్రాసెస్‌లో భాగంగా, తన మొబైల్ అప్లికేషన్‌లో అనధికారిక యాక్సెస్‌ను గుర్తించామని, దాని గురించి బీమా రెగ్యులేటర్‌కు తెలియజేసిట్లు స్టార్ హెల్త్ తెలిపింది.


PNC ఇన్ఫ్రాటెక్: రూ. 1,260 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టు కోసం అతి తక్కువ బిడ్డర్‌గా ఈ కంపెనీ నిలిచింది. పాచ్‌మోన్ గ్రామం నుంచి అనర్బన్‌సాలియా గ్రామం వరకు 6-లేన్ గ్రీన్‌ఫీల్డ్ వారణాసి-రాంచీ-కోల్‌కతా హైవే నిర్మాణంలో ఈ ప్రాజెక్టు ఒక భాగం.


గెయిల్ ఇండియా: JBF పెట్రోకెమికల్స్ కోసం గెయిల్ లిమిటెడ్ సమర్పించిన రూ. 2101 కోట్ల రిజల్యూషన్ ప్లాన్‌ను భారతదేశ దివాలా కోర్టు సోమవారం ఆమోదించింది.


కోల్ ఇండియా: వేసవి ప్రారంభం, విద్యుత్ కోసం పారిశ్రామిక డిమాండ్ పుంజుకుంటున్న నేపథ్యంలో బొగ్గు డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచినట్లు కోల్‌ ఇండియా తెలిపింది.     


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.