Stocks to watch today, 14 November 2022: ఇవాళ (సోమవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 38.5 పాయింట్లు లేదా 0.21 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,474.5 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ Q2 ఫలితాలు ప్రకటించనున్న మేజర్‌ కంపెనీలు: ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), గ్రాసిమ్ ఇండస్ట్రీస్, IRCTC, భారత్ ఫోర్జ్, బయోకాన్, అబాట్ ఇండియా, బాలకృష్ణ ఇండస్ట్రీస్, NMDC, లిండే ఇండియా, ఆర్తి ఇండస్ట్రీస్, AIA ఇంజినీరింగ్, GMR ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రా, అపోలో టైర్స్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, రాడికో ఖైతాన్


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా: 2022 సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ ప్రభుత్వ రంగ బీమా సంస్థ నికర లాభం అనేక రెట్లు పెరిగి రూ. 15,952 కోట్లకు చేరుకుంది. పెట్టుబడి లాభాలు పెరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో రూ. 1,434 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.


గోద్రెజ్ ప్రాపర్టీస్: నొయిడాలో కార్యకలాపాలను ఈ లియాల్టీ సంస్థ విస్తరిస్తోంది. 377 కోట్ల రూపాయల బిడ్‌తో రెండు ల్యాండ్ పార్శిల్స్‌కు హైయస్ట్‌ బిడ్డర్‌గా నిలిచింది. 


ఫోర్టిస్ హెల్త్‌కేర్: 2022 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ హెల్త్‌కేర్ చైన్ ఏకీకృత  పన్ను తర్వాతి లాభం రూ. 218.3 కోట్లకు చేరింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో నమోదైన రూ. 130.6 కోట్లతో పోలిస్తే 67.1 శాతం పెరిగింది. Q2FY23 ఏకీకృత ఆదాయం రూ. 1,607 కోట్లు.


భారత్ డైనమిక్స్: ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ డిఫెన్స్ కంపెనీ, FY23 సెప్టెంబరు త్రైమాసికంలో ఆరోగ్యకరమైన నిర్వహణ పనితీరును కనబరిచింది. లాభం 75.3 శాతం వార్షిక వృద్ధితో రూ. 75.8 కోట్లకు చేరుకుంది. ఇతర ఆదాయాలు భారీగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం 6.1 శాతం పెరిగి రూ. 534.8 కోట్లకు చేరుకుంది.


జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్: FY23 సెప్టెంబర్ త్రైమాసికం లాభం 58 శాతం క్షీణతతో రూ. 112.8 కోట్లకు పడిపోయింది. బలహీనమైన నిర్వహణ పనితీరు, తగ్గిన టాప్‌లైన్ వృద్ధి కారణంగా నష్టపోయింది. ఆదాయం 2.5 శాతం వృద్ధితో రూ.2,028.4 కోట్ల చేరింది.


ఎక్సైడ్ ఇండస్ట్రీస్: సెప్టెంబర్‌ త్రైమాసికానికి రూ. 246 కోట్ల నికర లాభాన్ని ఈ కంపెనీ ప్రకటించింది. గత ఏడాది లాభం రూ. 234 కోట్లతో పోలిస్తే ఐదు శాతం పెరిగింది. కార్యకలాపాల ఆదాయం 13 శాతం పెరిగి రూ. 3719 కోట్లకు చేరుకుంది.


గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటికల్స్: FY23 రెండో త్రైమాసికంలో ఈ ఔషధ తయారీ కంపెనీ నికర లాభం 3 శాతం పెరిగి రూ. 193 కోట్లకు చేరుకుంది. మునుపటి ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ కాలంలో రూ. 187 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.


మణప్పురం ఫైనాన్స్: ఈ గోల్డ్ లోన్ సంస్థ సెప్టెంబర్ త్రైమాసిక ఏకీకృత నికర లాభం 10.7 శాతం పెరిగి రూ. 409.48 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ కంపెనీ రూ. 369.88 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.