Stocks to watch today, 14 February 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 31 పాయింట్లు లేదా 0.17 శాతం గ్రీన్ కలర్‌లో 17,820 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
అదానీ ఎంటర్‌ప్రైజెస్: 2022 డిసెంబర్ త్రైమాసికం ఆదాయాలను అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఇవాళ ప్రకటిస్తుంది.
గుజరాత్ గ్యాస్: 2022 డిసెంబర్ త్రైమాసికంలో రూ. 324 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ. 123 కోట్ల నుంచి రెండున్నర రెట్లకు పైగా పెరిగింది. ఈ కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 3,684 కోట్లుగా ఉంది.
నైకా: డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నైకా ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 68% పడిపోయి రూ. 9 కోట్లకు దిగి వచ్చింది. అదే సమయంలో, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది ప్రాతిపదికన 33% పెరిగి రూ. 1,462 కోట్లకు చేరుకుంది.
ZEE: డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి, మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఏకీకృత నికర లాభంఏడాది ప్రాతిపదికన 91% క్షీణించి కేవలం రూ. 24 కోట్లకు చేరుకుంది. సమీక్ష కాల త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ. 2,127 కోట్లుగా ఉంది.
కృష్ణ డయాగ్నోస్టిక్స్: డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 14 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 16 కోట్లుగా ఉంది. అదే సమయంలో ఆదాయం ఏడాది ప్రాతిపదికన 11% పెరిగి రూ. 118 కోట్లకు చేరింది.
ఇక్రా: డిసెంబర్ త్రైమాసికంలో పన్ను తర్వాతి లాభం 26% పెరిగి రూ. 39.2 కోట్లకు చేరుకుంది, అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 31 కోట్లుగా నమోదైంది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఏకీకృత ఆదాయం 19% పెరిగి రూ. 103 కోట్లకు చేరుకుంది.
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్: 2022 డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 8% పెరిగి రూ. 3,860 కోట్లకు చేరుకోగా, నికర వడ్డీ ఆదాయం 7% తగ్గి రూ. 7,218 కోట్లకు చేరుకుంది.
హిందుస్థాన్ కాంపోజిట్స్: 2022 డిసెంబర్ త్రైమాసికానికి రూ. 5.4 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, ఏడాది ప్రాతిపదికన దాదాపు సగం తగ్గింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ. 10 కోట్లుగా ఉంది. మూడో త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 5% పెరిగి రూ. 69 కోట్లకు చేరుకుంది.
మేదాంత: అక్టోబర్-డిసెంబర్ కాలంలో రూ. 80 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నివేదించింది, గత ఏడాది ఇదే కాలంలో రూ. 70 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ద్వారా రూ. 694 కోట్ల ఆదాయం వచ్చింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.