Stocks to watch today, 08 March 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 131 పాయింట్లు లేదా 0.73 శాతం రెడ్‌ కలర్‌లో 17,722 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ ఫ్లాట్‌/నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


జీ ఎంటర్‌టైన్‌మెంట్: వివాదాన్ని పరిష్కరించుకుంటూ.. ZEE స్టూడియోస్ - IPRS (ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్ సొసైటీ) ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. తాము దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను వెనక్కు తీసుకునేందుకు ఐపీఆర్‌ఎస్ అంగీకరించింది.


LTIMindtree: తూర్పు ఐరోపాలో మరింతగా విస్తరిస్త్తోంది, పోలాండ్‌లోని క్రాకోలో కొత్త డెలివరీ సెంటర్‌ను ప్రారంభించింది.


విప్రో: న్యూజెర్సీలోని ఈస్ట్ బ్రున్స్‌విక్‌లో తన అమెరికన్‌ ప్రధాన కార్యాలయాన్ని విప్రో ప్రారంభించింది.


ఆల్‌కార్గో లాజిస్టిక్స్: తన భాగస్వాముల నుంచి 373 కోట్ల రూపాయలతో 38.87% వాటాను కొనుగోలు చేసేందుకు ఆల్‌కార్గో లాజిస్టిక్స్ లిమిటెడ్ బోర్డు ఓకే చెప్పింది. ఈ కొనుగోలుతో, కాంట్రాక్ట్ లాజిస్టిక్స్ వ్యాపారంలో ఆల్‌కార్గో లాజిస్టిక్స్ వాటా 100%కి చేరుతుంది.


అదానీ గ్రూప్ స్టాక్స్: అదానీ గ్రూప్ రూ. 7,374 కోట్ల విలువైన లోన్‌లను ముందే చెల్లించింది. 2025 ఏప్రిల్‌లో చెల్లించాల్సిన లోన్లను మెచ్యూరిటీకి ముందే తీర్చేసింది.


పవర్‌ గ్రిడ్‌: ప్రభుత్వ యాజమాన్యంలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ బోర్డు, దేశంలో రెండు ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టుల కోసం దాదాపు రూ. 4,071 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.


HAL, L&T: రూ. 6,800 కోట్లతో 70 HTT-40 బేసిక్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో (HAL) భారత రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. మూడు క్యాడెట్ ట్రైనింగ్ షిప్‌ల కోసం L&Tతోనూ ఒప్పందంపై సంతకం చేసింది.


జేపీ ఇన్‌ఫ్రాటెక్: జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ని దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా కొనుగోలు చేసేందుకు సురక్ష గ్రూప్‌నకు చెందిన బిడ్‌ను దివాలా కోర్టు ఆమోదించింది.


అశోక్ బిల్డ్‌కాన్: నార్త్‌ బిహార్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (NBPDCL) నుంచి రూ. 366 కోట్ల విలువైన ఆర్డర్‌ను అశోకా బిల్డ్‌కాన్ దక్కించుకుంది.


నాట్కో ఫార్మా: షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించేందుకు కంపెనీ బోర్డు ఇవాళ సమావేశం అవుతోంది, మార్కెట్‌ దృష్టి దీనిపైనే ఉంటుంది.


అజంతా ఫార్మా: ఈక్విటీ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను ఆమోదించేందుకు అజంతా ఫార్మా బోర్డు మార్చి 10, శుక్రవారం నాడు సమావేశం కానుంది.


కాఫీ డే: సెబీ విధించిన రూ. 26 కోట్ల పెనాల్టీపై సెక్యూరిటీస్ అండ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (SAT) స్టే ఇచ్చింది.


హీరో మోటోకార్ప్: ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిళ్ల ఉత్పత్తి కోసం కాలిఫోర్నియాకు చెందిన జీరో మోటార్‌ సైకిల్స్‌తో హీరో మోటోకార్ప్ ఒప్పందం కుదుర్చుకుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.