Stocks to watch today, 07 February 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 71 పాయింట్లు లేదా 0.40 శాతం గ్రీన్‌ కలర్‌లో 17,832 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


టాటా స్టీల్: 2022 డిసెంబర్ త్రైమాసికంలో, ఆశ్చర్యకరంగా, టాటా స్టీల్ 2,224 కోట్ల రూపాయల ఏకీకృత నికర నష్టాన్ని నివేదించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ. 9,572 కోట్లు కాగా, 2022 సెప్టెంబర్ త్రైమాసికంలో లాభం రూ. 1,514 కోట్లుగా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం ఏడాది ప్రాతిపదికన (YoY) 6% తగ్గి రూ. 57,083 కోట్లకు చేరుకుంది.


అదానీ ట్రాన్స్‌మిషన్: డిసెంబరు త్రైమాసికంలో అదానీ ట్రాన్స్‌మిషన్ ఏకీకృత లాభం సంవత్సరానికి (YoY) 73% రూ. 478 కోట్లకు పెరిగింది. సమీక్ష కాలంలో కంపెనీ ఆదాయం 15.8% పెరిగి రూ. 3,037 కోట్లకు చేరుకుంది.


అదానీ గ్రూప్ కంపెనీలు: 2024 సెప్టెంబర్‌ వరకు చెల్లింపులకు గడువున్న తమ కంపెనీల తాకట్టు షేర్లను ముందే విడిపించుకోవడానికి ప్రమోటర్లు $1,114 మిలియన్లను చెల్లిస్తారని అదానీ గ్రూప్ ప్రకటించింది. అదానీ గ్రూప్‌ మోసం & స్టాక్ మానిప్యులేషన్ చేసిందంటూ అమెరికన్‌ షార్ట్ సెల్లర్ చేసిన ఆరోపణల దృష్ట్యా ఈ ప్రకటన ప్రాముఖ్యతను సంతరించుకుంది.


ఎయిర్‌టెల్‌: 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ నికర లాభం రెండింతలు పెరిగి రూ. 2,107 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. నికర విక్రయాలు 19% పెరిగి రూ. 35,477 కోట్లకు చేరుకోవచ్చని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది.


అల్ట్రాటెక్ సిమెంట్: ఒడిషాలోని ఝర్సుగూడలో 1.5 mpta బ్రౌన్‌ఫీల్డ్ సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ను ఈ కంపెనీ ప్రారంభించింది. దీంతో ఒడిశా రాష్ట్రంలో కంపెనీ మొత్తం సిమెంట్ సామర్థ్యం 4.1 mtpaకి చేరుకుంది.


ముత్తూట్ ఫైనాన్స్: 2022 డిసెంబర్‌ త్రైమాసికానికి రూ. 934 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని, 4% త్రైమాసిక వృద్ధిని (QoQ) ఈ కంపెనీ సాధించింది. నిర్వహణలో ఉన్న ఏకీకృత రుణ ఆస్తులు ఏడాది ప్రాతిపదికన 7% వృద్ధితో రూ. 65,085 కోట్లకు పెరిగాయి.


LIC హౌసింగ్ ఫైనాన్స్: 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఈ గృహ రుణాల కంపెనీ నికర లాభం రూ. 462 కోట్లకు తగ్గింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 771 కోట్ల లాభాన్ని ఈ కంపెనీ సాధించింది. అదే సమయంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 5,890 కోట్లుగా ఉంది.


JK పేపర్: ఏకీకృత టర్నోవర్ 59% వృద్ధితో రూ. 1,734 కోట్లకు చేరుకుంది. పన్ను తర్వాత లాభం గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే రెట్టింపై, 119% పెరిగింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.