Stocks to watch today, 01 March 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 25 పాయింట్లు లేదా 0.14 శాతం రెడ్‌ కలర్‌లో 17,374 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


డెలివెరీ: జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, ఇవాళ, బ్లాక్ డీల్స్ ద్వారా డెలివెరీలో రూ. 600 కోట్ల విలువైన షేర్లను విక్రయించాలని చూస్తోంది.


NTPC: 2022 జులై నాటి వ్యాపార బదిలీ ఒప్పందం ప్రకారం, NTPC పూర్తి అనుబంధ సంస్థ అయిన NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు 15 పునరుత్పాదక ఇంధన ఆస్తుల బదిలీని పూర్తి చేసింది.


రిలయన్స్ ఇండస్ట్రీస్: రిలయన్స్ SOU Ltd అనే పేరుతో ఒక అనుబంధ సంస్థను వాణిజ్య అవసరాల కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసింది. వాణిజ్య అవసరాల కోసం ఆస్తుల అభివృద్ధి వ్యాపారాన్ని ఇది చూసుకుంటుంది. ప్రారంభ మూలధనంగా అనుబంధ సంస్థలో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టింది.


జైడస్ లైఫ్ సైన్సెస్: అమెరికాలో Apixaban టాబ్లెట్‌లను మార్కెట్‌ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US FDA) నుంచి Zydus Lifesciences తుది ఆమోదం పొందింది. రక్తాన్ని గడ్డకట్టించే కొన్ని పదార్థాల కార్యకలాపాలను Apixaban అడ్డుకుంటుంది.


BEL: TR మాడ్యూల్స్, రాడార్ LRUలు (లైన్ రీప్లేసబుల్ యూనిట్లు), మైక్రో మాడ్యూల్స్ తయారీ & సరఫరా కోసం థేల్స్ రిలయన్స్ డిఫెన్స్ సిస్టమ్స్‌తో (TRDS) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఒప్పందం కుదుర్చుకుంది.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సిండికేటెడ్ సోషల్ లోన్ ద్వారా $1 బిలియన్‌ సేకరించింది. బ్యాంకు సేకరించిన తొలి సోషల్‌ లోన్‌ ఇదే.


హాత్‌వే కేబుల్: కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ & పదవికి వ్యక్తిగత కారణాల వల్ల రాజన్ గుప్తా రాజీనామా చేశారు. మార్చి 09 నుంచి సేవల నుంచి ఆయన రిలీవ్ కానున్నారు.


అదానీ గ్రూప్ కంపెనీలు: మార్చి చివరి నాటికి $690 - $790 మిలియన్ల విలువైన షేర్-బ్యాక్డ్ రుణాలను ముందస్తుగా చెల్లించాలని అదానీ గ్రూప్ యోచిస్తోందని రాయిటర్స్ నివేదించింది. తద్వారా గ్రూప్‌పై నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది.


ఆటో స్టాక్స్: వాహన కంపెనీల ఫిబ్రవరి అమ్మకాల నెలవారీ లెక్కలు విడులవుతాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆటో స్టాక్స్‌ ఫోకస్‌లో ఉంటాయి.


టాటా పవర్: గ్రీన్‌ఫారెస్ట్ న్యూ ఎనర్జీస్ బిడ్కో లిమిటెడ్‌కు ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన రూ. 2,000 కోట్ల విలువైన 20 కోట్ల కంపల్సరీ కన్వర్టబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లను కేటాయించడానికి టాటా పవర్ యొక్క అనుబంధ సంస్థ అయిన టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ఆమోదించింది.


Paytm: కంపెనీలో ప్రధాన వాటాదార్లు తమ వాటాలను విక్రయిస్తున్నట్లు వచ్చిన వార్తలను Paytm తిరస్కరించింది. కంపెనీ ఎటువంటి చర్చల్లో పాల్గొనలేదని, అసలు అటువంటి కార్యక్రమాలే జరగడం లేదని స్పష్టం చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.