Stock Market Update: గ్లోబల్‌గా మెయిన్‌ ఈవెంట్స్‌ అన్నీ అయిపోయాయి. ప్రస్తుతానికి నెగెటివ్‌ ఫ్యాక్టర్స్‌ కనిపించడం లేదు. పన్నుల రద్దు నిర్ణయాన్ని బ్రిటన్‌ ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంతో యూరోపియన్‌ మార్కెట్లు బూస్ట్‌ తాగినట్లు పరిగెడుతున్నాయి. ఆ బలం ఇండియన్ మార్కెట్లను కూడా పైకి కదిలిస్తోంది. ఈక్విటీ డెరివేటివ్స్‌లో ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FIIs) షార్ట్‌ పొజిషన్లు క్రమంగా తగ్గుతున్నాయి. దీనర్ధం వాళ్లు కూడా ఇండియన్‌ మార్కెట్‌ మీద సానుకూలంగా ఉన్నారని. ఈ నేపథ్యంలో, మార్కెట్‌ ఎక్స్‌పర్ట్‌లు 3 స్టాక్స్‌ మీద బుల్లిష్‌గా ఉన్నారు. ఇవి 22 -37 శాతం వరకు లాభాలు ఇవ్వగలని అంచనా వేశారు. ఆ 3 స్టాక్స్‌:


గ్లాండ్‌ ఫార్మా (GLAND PHARMA)3 
బ్రోకరేజ్‌: మోర్గాన్‌ స్టాన్లీ
టార్గెట్‌ ధర: రూ. 2,748
మంగళవారం నాటి ముగింపు ధర: రూ. 2,155
వృద్ధి అవకాశం: 27.5 శాతం


మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley), "ఓవర్‌ వెయిట్‌" రేటింగ్‌తో గ్లాండ్‌ ఫార్మా మీద  కవరేజీ ప్రారంభించింది. ఇతర కంపెనీలు అడుగు పెట్టేందుకు ఇబ్బంది పడే ఇంజెక్టబుల్‌ కేటగిరీ, సమర్థవంతమైన మూలధన నిర్వహణను గ్లాండ్‌ ఫార్మా బలంగా చూస్తూ ఈ రేటింగ్ ఇచ్చినట్లు బ్రోకరేజ్‌ వెల్లడించింది. F23-24లో 22% EPS CAGRను అంచనా వేస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు చూసిన 45% ప్రైస్‌ కరెక్షన్ ఇకపై బౌన్స్‌ బ్యాక్‌ అవుతుందని క్లయింట్ నోట్‌లో పేర్కొంది.


టీవీఎస్‌ మోటార్‌ ‍(TVS MOTOR‌)
బ్రోకరేజ్‌: యూబీఎస్‌ 
టార్గెట్‌ ధర: రూ. 1,385
మంగళవారం నాటి ముగింపు ధర: రూ. 1,129.60
వృద్ధి అవకాశం: 22.6 శాతం


ఈ స్టాక్‌కు 'బయ్‌' రేటింగ్‌ ఇచ్చిన యూబీఎస్‌ (UBS), ప్రైస్‌ టార్గెట్‌ను రూ.1,100 నుంచి రూ.1,385కి పెంచింది. ఎలక్ట్రానిక్‌ వెహికల్స్‌ (EV) విభాగంలో ఐక్యూూబ్‌ ‍(iQube) సహా "బెస్ట్‌ ఇన్ క్లాస్" ప్రొడక్ట్‌ పైప్‌పైన్‌కు వస్తున్న ప్రతిస్పందనను బట్టి.. మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో ఎలక్ట్రానిక్‌ వెహికల్స్‌కు మార్కెట్ లీడర్‌గా టీవీఎస్‌ మోటార్‌ అవతరిస్తుందని బ్రోకరేజ్‌ నమ్మకంగా ఉంది.


క్రాఫ్ట్‌మన్‌ ఆటోమేషన్ (CRAFTSMAN AUTOMATION)
బ్రోకరేజ్‌: యాక్సిస్ క్యాపిటల్‌
టార్గెట్‌ ధర: రూ. 3,800
మంగళవారం నాటి ముగింపు ధర: రూ. 2,780.30
వృద్ధి అవకాశం: 36.7 శాతం


క్రాఫ్ట్‌మన్‌ ఆటోమేషన్‌ స్టాక్‌కు 'బయ్‌' రేటింగ్‌ కొనసాగించిన యాక్సిస్ క్యాపిటల్‌ ‍(Axis Capital), ధర లక్ష్యాన్ని రూ.3,600 నుంచి రూ.3,800కి పెంచింది. ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే నిలకడగా ఔట్ పెర్ఫార్మెన్స్ చేస్తుందని అంచనా వేసింది.


ALSO READ: ఒక షేర్‌ కొంటే మరొకటి ఫ్రీ - మహారాష్ట్ర సీమ్‌లెస్‌ బోనస్‌ ఇష్యూ


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.