TCS Q4 Results Today: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్చి త్రైమాసిక ఫలితాలు (Q4 FY24) ఈ రోజు మార్కెట్‌ ముగిసిన తర్వాత వెలువడతాయి. దీంతో, కంపెనీ షేర్లు ఈ రోజు (శుక్రవారం, 12 ఏప్రిల్‌ 2024) ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి.


మధ్యాహ్నం 3:20 గంటల సమయానికి, టీసీఎస్‌ ఈ షేరు స్వల్పంగా పెరిగి రూ. 3,988.40 వద్ద ట్రేడవుతోంది. దీనికి ముందు, ఈ స్టాక్ 0.77 శాతం పెరిగి ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ. 4,013.35 ను తాకింది. మధ్యాహ్నం 3:20 గంటల సమయానికి... BSE సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు తగ్గి 74,343 స్థాయిల వద్ద ట్రేడవుతోంది. NSE నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టంతో 22,540 వద్ద ఉంది. మరోవైపు బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ 0.15 శాతం పెరిగి ఇంట్రాడే గరిష్ట స్థాయి 36,140.90కి చేరుకుంది.


TCS ఫలితాలపై అంచనాలు
గత ఏడాది ఇదే కాలంతో (Q4 FY23) పోలిస్తే, Q4 FY24లో TCS ఆదాయం & లాభం రెండింటిలోనూ ఏక అంకె వృద్ధిని కంపెనీ నమోదు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మేజర్‌ డీల్స్‌, కార్యాచరణ సామర్థ్యం దీనికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు. BSNLతో కుదుర్చుకున్న ఒప్పందాల వంటివి ఆదాయ వృద్ధిని పెంచుతాయని లెక్కగట్టారు.


Q4 FY24లో TCS నికర లాభం రూ. 11,452 కోట్ల నుంచి రూ. 12,283 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఇది, Q4 FY23తో పోలిస్తే 7-8 శాతం పెరుగుదలను సూచిస్తుంది. QoQలో 3-7 శాతం వృద్ధి చెందొచ్చు. కంపెనీ ఆదాయం రూ. 61,077 కోట్ల నుంచి రూ. 61,662 కోట్లకు చేరుతుందని, YoYలో 3 నుంచి 4 శాతం వృద్ధి చెందుతుందని అంచనా.


గత త్రైమాసికం ఫలితాలు
2023 డిసెంబర్ త్రైమాసికంలో (Q3 FY24) TCS ఏకీకృత నికర లాభం రూ. 10,846 కోట్లుగా లెక్క తేలింది. ఇది 3.98 శాతం వృద్ధి. నికర అమ్మకాలు Q2 FY23తో పోలిస్తే 5.28 శాతం పెరిగి రూ. 58,229 కోట్లకు చేరుకున్నాయి. ఏడాది ప్రాతిపదికన (YoY), నికర లాభం & నికర అమ్మకాలు వరుసగా 11.02 శాతం & 19.11 శాతం పెరిగాయి.


స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయం సంవత్సరానికి 13.5 శాతం పెరిగింది. అయితే, Q3 FY23లో ఆపరేటింగ్ మార్జిన్ 0.5 శాతం తగ్గి 24.5 శాతానికి పడిపోయింది. ఆ క్వార్టర్‌లో కంపెనీ ఆర్డర్ బుక్ 7.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 


పన్నుకు ముందు లాభం (PBT)... Q2 FY23లోని రూ. 14,096 కోట్లతో పోలిస్తే, Q3 FY23లో 3.89 శాతం పెరిగి రూ.14,644 కోట్లకు చేరుకుంది.


2023 డిసెంబర్‌ త్రైమాసికంలో TCS ఉద్యోగుల సంఖ్య నికరంగా 5,680 తగ్గింది. ఈ కంపెనీలో సిబ్బంది సంఖ్య తగ్గడం వరుసగా ఇది సెకండ్‌ క్వార్టర్‌. 2023-24లో 40,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకుంటామని గతంలోనే ఈ టెక్‌ మేజర్‌ ప్రకటించింది. ఎంతమంది కొత్త వాళ్లను తీసుకున్నారో ఈ రోజు సాయంత్రం తేలిపోతుంది. గత త్రైమాసికంలో TCS వలసల రేటు 13.3 శాతానికి తగ్గింది. వలసల రేటు తగ్గడం ఏ కంపెనీకి అయినా మంచి విషయం.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: భారతి హెక్సాకామ్ బంపర్ లిస్టింగ్, ఇన్వెస్టర్లకు లాభాల పంట