Stock Market @12 PM:  భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) బుధవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవ్వడం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం భయాలు ఇంకా వెంటాడుతున్నాయి. కంపెనీ ఆదాయాలు ఆశించన రీతిలో లేకపోవడం మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,035 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 496కి పైగా నష్టాల్లో ఉంది.


BSE Sensex


క్రితం సెషన్లో 57,356 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 56,983 వద్ద నష్టాల్లో మొదలైంది. ఉదయం నుంచే ఫ్లాట్‌గా కొనసాగింది. 57,079 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. 56,795 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 496 పాయింట్ల నష్టంతో 56,860 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


మంగళవారం 17,200 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,073 వద్ద ఓపెనైంది. కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో  ఉదయం నుంచి సూచీ నష్టాల్లోనే కదలాడింది. 17,110 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. 17,016 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి తాకింది. ప్రస్తుతం 165 పాయింట్ల నష్టంతో 17,035 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఉదయం 36,967 వద్ద మొదలైంది. 36,901 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,175 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 453 పాయింట్ల లాభంతో 35,951 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 6 కంపెనీలు లాభపడగా 44 నష్టాల్లో కొనసాగుతున్నాయి. హీరోమోటోకార్ప్‌, రిలయన్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, కొటక్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హిందాల్కో, ఎస్‌బీఐ లైఫ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ నష్టాల్లో ఉన్నాయి. ఐటీ, మెటల్‌, ఫార్మా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, బ్యాంక్‌, రియాల్టీ, ఎఫ్‌ఎంసీజీ ఒక శాతం వరకు నష్టపోయాయి.