భారత స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాలతో కళకళలాడుతున్నాయి. కీలక సూచీలకు మద్దతు లభించింది. ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఓపెన్‌ కావడం మదుపర్లలో సానుకూల సెంటిమెంట్‌కు దారితీసింది. దాంతో నేడు కొనుగోళ్ల జాతర కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 700+, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  250+ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.


క్రితం సెషన్లో 57,276 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,795 వద్ద భారీ గ్యాప్‌అప్‌తో మొదలైంది. అక్కడ్నుంచి కొనుగోళ్లు జోరందుకోవడంతో 58,044 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఉదయం 11:30 గంటలకు 675 పాయింట్ల లాభంతో 57,953 వద్ద కొనసాగుతోంది.


బుధవారం 17,110 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,208 వద్ద భారీ గ్యాప్‌ అప్‌తో ఆరంభమైంది. ఆ తర్వాత ఊర్ధ్వ ముఖంగా పయనిస్తూ 17,359 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 220 పాయింట్ల లాభంతో 17,329 వద్ద కొనసాగుతోంది.


Also Read: MSME Sector Budget 2022 Expectations: నిర్మలమ్మా..! 'సూక్ష్మం' ఎరిగి 'లాభం' చేకూర్చండి!!


Also Read: Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ


బ్యాంక్‌ నిఫ్టీ ఒడుదొడుకుల మధ్య సాగుతోంది. ఉదయం 38,246 వద్ద మొదలైన సూచీ 38,023 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత 38,412 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 222 పాయింట్ల లాభంతో 38,204 వద్ద కొనసాగుతోంది.


నిఫ్టీలో 47 కంపెనీలు లాభాల్లో 3 కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, విప్రో లాభాల్లో కొనసాగుతున్నాయి. మారుతీ, పవర్‌గ్రిడ్‌, హిందుస్థాన్‌ యునిలివర్‌ స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాల సూచీలు 1-3 శాతం లాభాల్లో ఉన్నాయి.