Stock Market @12 PM: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) గురువారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవ్వడం మదుపర్లలో సానుకూల సెంటిమెంట్ నింపింది. ఐటీ మినహాయిస్తే మిగతా రంగాల స్టాకులు కొనుగోలు చేసేందుకు మదుపర్లు ఎగబడుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 2.09 శాతం లాభపడటంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.19 లక్షల కోట్లను దాటేసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,173 వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 519కి పైగా లాభాల్లో ఉంది.
BSE Sensex
క్రితం సెషన్లో 56,819 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,296 వద్ద లాభాల్లో మొదలైంది. ఉదయం నుంచే దూకుడుగా ట్రేడ్ అవుతోంది. 57,333 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. 56,936 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 519 పాయింట్ల లాభంతో 57,336 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
బుధవారం 17,038 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,189 వద్ద ఓపెనైంది. కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఉదయం నుంచి సూచీ పై స్థాయికి దూసుకుపోతోంది. 17,189 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. 17,071 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి తాకింది. ప్రస్తుతం 133 పాయింట్ల లాభంతో 17,173 వద్ద ట్రేడ్ అవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ట్రేడ్ అవుతోంది. ఉదయం 36,189 వద్ద మొదలైంది. 35,951 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,240 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 115 పాయింట్ల లాభంతో 36,144 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 41 కంపెనీలు లాభపడగా 9 నష్టాల్లో కొనసాగుతున్నాయి. హిందుస్థాన్ యునీలివర్, ఏసియన్ పెయింట్స్, ఎల్‌టీ, యూపీఎల్, రిలయన్స్ 2 శాతానికి పైగా లాభపడ్డాయి. హిందాల్కో, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ, ఎం అండ్ ఎం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఫార్మా, పవర్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. ఐటీ, మెటల్, రియాల్టీ సూచీలు నెగెటివ్‌గా ఉన్నాయి.