Stock Market closing bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం భారీగా లాభపడ్డాయి. మూడు రోజుల వరుస నష్టాలకు ఫుల్‌స్టాప్ పెట్టేశాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా ఉంచడం మదుపర్లలో సానుకూల సెంటిమెంటు నింపింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,784 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 412 పాయింట్లు లాభపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 59,034 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,256 వద్ద లాభాల్లో మొదలైంది. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ నేపథ్ంయలో ఉదయం నుంచీ సూచీ లాభాల్లోనే ట్రేడైంది. 58,876 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ 59,654 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. చివరికి 412 పాయింట్ల లాభంతో 59,447 ముగిసింది.
NSE Nifty
గురువారం 17,639 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,698 వద్ద ఓపెనైంది. 17,600 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది. ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను మార్పు చేయడం లేదని చెప్పడంతో 17,842 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 144 పాయింట్ల నష్టంతో 17,784 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ 37,619 వద్ద మొదలైంది. 37,405 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 37,884 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 194 పాయింట్ల లాభంతో 37,752 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 42 కంపెనీలు లాభపడగా 8 నష్టాల్లో ముగిశాయి. గ్రాసిమ్, ఐటీసీ, ఎస్‌బీఐ లైఫ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభపడ్డాయి. సిప్లా, టెక్ మహీంద్రా, మారుతీ, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్ నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, మెటల్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1-2 శాతం పెరిగాయి.