Stock Market closing bell:  భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) వరుసగా మూడో రోజు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కనిపించడం లేదు. ఉదయం నష్టాలతోనే ఆరంభమైనా మధ్యాహ్నం కాస్త పుంజుకున్నాయి. ఐరోపా మార్కెట్లు మొదలవ్వడం, డెరివేటివ్స్‌ వారంతపు ముగింపు కావడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,639 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 557 పాయింట్లు నష్టపోయింది.


BSE Sensex


క్రితం సెషన్లో 59,815 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,402 వద్ద నష్టాల్లో మొదలైంది. ఉదయం నుంచీ సూచీ ఒడుదొడుకుల్లోనే ట్రేడైంది. మధ్యాహ్ణం 59,504 వద్ద ఇంట్రాడే గరిస్ఠాన్ని తాకిన సూచీ 58,977 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. చివరికి 575 పాయింట్ల నష్టంతో 59,034 వద్ద ముగిసింది.


NSE Nifty


బుధవారం 17,807 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,723 వద్ద ఓపెనైంది. మధ్యాహ్నం సమయంలో 17,787 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయిని అందుకుంది. ఐరోపా మార్కెట్లు తెరుచుకున్నాక ఒక్కసారిగా పడిపోయింది. 17,623 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 168 పాయింట్ల నష్టంతో 17,639 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ 37,421 వద్ద మొదలైంది. 37,346 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 37,975 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 75 పాయింట్ల నష్టంతో 37,557 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 22 కంపెనీలు లాభపడగా 28 నష్టాల్లో ముగిశాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, దివిస్‌ ల్యాబ్‌, హిందుస్థాన్ యునీలివర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్టు, టైటాన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్‌జీసీ, టీసీఎస్‌ నష్టపోయాయి. ఫార్మాను మినహాయిస్తే మిగతా సూచీలన్నీ నష్టపోయాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పవర్‌, మెటల్‌ సూచీలు 1-2 శాతం వరకు పతనమయ్యాయి.