Stock Market closing bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం లాభపడ్డాయి. బెంచ్‌మార్క్ సూచీలు రోజువారీ గరిష్ఠ స్థాయిల్లో ముగిశాయి. మార్కెట్లో నేడు నెగెటివ్ సెంటిమెంటు రాలేదు. పరిస్థితులు స్థిరత్వంవైపు పయనిస్తుండటంతో మదుపర్లు కొనుగోళ్లు చేపడుతున్నారు. ఫార్మా, రియాల్టీ, క్యాపిటల్స్ గూడ్స్ షేర్ల దన్నుతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,300 మీద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 350 పాయింట్లు లాభపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 57,593 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,813 వద్ద లాభాల్లోనే మొదలైంది. అప్పట్నుంచి మధ్యాహ్నం వరకు రేంజ్‌బౌండ్‌లోనే కదలాడింది. 57,639 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఒక్కసారిగా కొనుగోళ్లు పెరగడంతో 58,001 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 350 పాయింట్ల లాభంతో 57,943 వద్ద ముగిసింది.
NSE Nifty
సోమవారం 17,222 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,297 వద్ద ఓపెనైంది. చాలాసేపటి వరకు ఫ్లాట్‌గా ట్రేడైంది. 17,235 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం పుంజుకున్న సూచీ 17,345 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 113 పాయింట్ల లాభంతో 17,335 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ 35,931 వద్ద మొదలైంది. 35,506 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో 35,977 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 136 పాయింట్ల లాభంతో 35,847 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభపడగా 18 నష్టాల్లో ముగిశాయి. ఐచర్ మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, దివిస్ ల్యాబ్, అదానీ పోర్ట్సు, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభపడ్డాయి. హీరోమోటో కార్ప్, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, ఐఓసీ, ఐటీసీ నష్టపోయాయి. ఆయిల్ అండ్ గ్యాస్‌ను మినహాయిస్తే మిగతా అన్ని సూచీలు లాభాల్లోనే ఉన్నాయి. ఫార్మా, రియాల్టీ ఒక శాతం వరకు ఎగిశాయి.