Stock Market Closing bell:  భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) బుధవారం కాస్త కోలుకున్నాయి. వరుస నష్టాలకు చెక్‌ పెట్టాయి. ద్రవ్యోల్బణం భయాలు వెంటాడుతున్నా నేడు మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,136 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 574 పాయింట్ల మేర లాభపడింది.


BSE Sensex


క్రితం సెషన్లో 56,463 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 56,741 వద్ద లాభాల్లో మొదలైంది. ఉదయం నుంచి అదే జోరు కొనసాగించింది. 56,463 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది. ఐరోపా మార్కెట్లు తెరచుకున్నాక 57,216 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 574 పాయింట్ల లాభంతో 57,037 వద్ద ముగిసింది.


NSE Nifty


మంగళవారం 16,958 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,186 వద్ద ఓపెనైంది. ఉదయం 16,978 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం ఒక్కసారిగా పుంజుకొని 17,186 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. చివరికి 177 పాయింట్ల లాభంతో 17,136 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ మాత్రం స్వల్పంగా నష్టపోయింది. ఉదయం 36,482 వద్ద మొదలైంది. 36,114 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,513 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 26 పాయింట్ల నష్టంతో 36,314 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభపడగా 12 నష్టాల్లో ముగిశాయి. బీపీసీఎల్‌, టాటా మోటార్స్‌, శ్రీసెమ్‌, ఐచర్‌ మోటార్స్‌, మారుతీ లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, ఎల్‌టీ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. ఆటో, ఫార్మా, ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల సూచీలు ఒక శాతం వరకు ఎగిశాయి. మెటల్‌, బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు కనిపించాయి.