Stock Market closing bell:  భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) గురువారం ఫ్లాట్‌గా ట్రేడ్‌ అయ్యాయి. బెంచ్‌మార్క్‌ సూచీలు రోజువారీ స్వల్పంగా నష్టపోయాయి. డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల వారాంతపు ముగింపు కావడంతో సూచీలు రేంజ్‌బౌండ్‌లోనే కదలాడాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,500 దిగువన ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 115 పాయింట్లు లాభపడింది.


BSE Sensex


క్రితం సెషన్లో 58,683 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,779 వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. కాసేపు ఫ్లాట్‌గా ట్రేడ్‌ అయిన సూచీ డెరివేటివ్స్‌ వారాంతం కావడంతో క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. 58,890 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సూచీ 58,485 వద్ద కనిష్ఠాన్ని చేరుకుంది. చివరికి 115 పాయింట్ల లాభంతో 58,568 వద్ద ముగిసింది.


NSE Nifty


బుధవారం 17,498 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,519 వద్ద నష్టాల్లో ఓపెనైంది. 17,559 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సూచీ 17,435 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది. చివరికి 33 పాయింట్ల నష్టంతో 17,464 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ 36,457 వద్ద మొదలైంది. 36,278 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,590 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 39 పాయింట్ల లాభంతో 36,457 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 20 కంపెనీలు లాభపడగా 30 నష్టాల్లో ముగిశాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎంఅండ్‌ ఎం, బ్రిటానియా, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా కన్జూమర్‌ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, దివిస్‌ ల్యాబ్‌, అపోలో హాస్పిటల్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, రిలయన్స్‌ నష్టపోయాయి. ఫార్మాను మినహాయిస్తే మిగతా రంగా సూచీలన్నీ లాభాల్లోనే ముగిశాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, బ్యాకింగ్‌ సూచీలు కాస్త ఎక్కువ ఎగిశాయి.