Stock Market News: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఈక్విటీ బెంచ్ మార్క్ సెన్సెక్స్ జీవితకాల గరిష్ట స్థాయి 72,720.96 ను తాకింది. మరోవైపు నిఫ్టీ 21,928.25 వద్ద రికార్డు స్థాయిని చేరింది. ప్రారంభ ట్రేడింగ్‌లో 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 492 పాయింట్లు పెరిగి 72,213.89 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో ఈ సరికొత్త జీవనకాల గరిష్టాలను అందుకున్నాయి. సూచీలు ముగిసే సమయానికి కొద్దిగా క్షీణించాయి.


డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో క్లైంట్స్ నుంచి డిమాండ్ మందగించడం.. యాన్యువల్ సేల్స్ ఫోర్‌కాస్ట్ తగ్గడం వల్ల నికర లాభంలో డిసెంబరు త్రైమాసికంలో ఊహించిన దానికంటే తక్కువ 7.3 శాతం తగ్గుదలని నివేదించినప్పటికీ, ప్రారంభ ట్రేడ్‌లో ఇన్ఫోసిస్ 6 శాతానికి పైగా ఎగబాకింది. అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల ఎగుమతిదారు అయిన ఇన్ఫోసిస్ డిసెంబరు త్రైమాసికంలో నికర ఆదాయంలో 8.2 శాతం వృద్ధితో రూ.11,735 కోట్లకు చేరుకున్నట్లు నివేదించిన తర్వాత.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దాదాపు 4 శాతం ఎగబాకింది. ఇది దేశీయ మార్కెట్‌లో భారీ వృద్ధికి కారణమయింది. అదే సమయంలో యూఎస్ మార్కెట్లో 3 శాతం డీ-గ్రోత్ కు కారణం అయింది. 


గ్లోబల్ మార్కెట్లు ఇలా
అంతర్జాతీయ మార్కెట్ షేర్లు శుక్రవారం మిశ్రమంగా ఉన్నాయి. టోక్యో మార్కెట్ బెంచ్‌మార్క్ న్యూ ఇయర్ ఉత్సాహాన్ని కొనసాగించింది. అది ప్రస్తుతం 35 వేల కంటే ఎక్కువ ట్రేడ్ అవుతోంది. అటు చమురు ధరలు బ్యారెల్‌కు $1 కంటే ఎక్కువ పెరిగాయి.


నేడు (జనవరి 12) ఉదయం 9:25 గంటల సమయంలోనే సూచీలు లాభాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్‌ 287 పాయింట్లు పెరిగి ఓ దశలో 72,008 వద్ద ట్రేడయింది. నిఫ్టీ 76 పాయింట్లు పుంజుకొని 21,723 దగ్గర కొనసాగింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.08 వద్ద ప్రారంభమైంది.


సెన్సెక్స్‌-30 సూచీలో ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, ఎం అండ్ ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌ షేర్లు నష్టాల్లో కొనసాగాయి.