Stock Market News Today in Telugu: ఈ రోజు (గురువారం, 29 ఫిబ్రవరి 2024) ఇండియా Q3 GDP డేటా వెల్లడికావడంతో పాటు F&O మంత్లీ ఎక్స్‌పైరీ ఉండడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు దాదాపు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి, ఆ తర్వాత పుంజుకునే ప్రయత్నం చేస్తున్నాయి. నిన్నటి భారీ పతనం తాలూకు ఆందోళనలు ఓపెనింగ్ ట్రేడ్‌లో కనిపించాయి. PSBలు తప్ప అన్ని సెక్టార్లు రెడ్ జోన్‌లోకి జారిపోయాయి. రిలయన్స్-డిస్నీ ఒప్పందం నేపథ్యంలో మీడియా స్టాక్స్ మార్కెట్ ఫోకస్‌లోకి వచ్చాయి.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (బుధవారం) 72,305 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 84.31 పాయింట్ల పతనంతో 72,220.57 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. బుధవారం 21,951 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 15.95 పాయింట్ల పతనంతో 21,935.20 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
విస్తృత మార్కెట్లలో, BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ & స్మాల్ క్యాప్ ఇండెక్స్ మీద అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంది. అవి రెండూ 1% చొప్పున పడిపోయాయి.
మార్కెట్ ప్రారంభ సమయంలో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో.. 19 స్టాక్స్ లాభాలను నమోదు చేయగా, 11 స్టాక్స్ క్షీణించాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.20 శాతం, మారుతి 0.99 శాతం, టైటన్ 0.60 శాతం, విప్రో 0.54 శాతం, M&M 0.42 శాతం బలంగా ఉన్నాయి. సెన్సెక్స్ టాప్ లూజర్లలో.. పవర్ గ్రిడ్ ఈ రోజు కూడా 1 శాతం పడిపోయింది. యాక్సిస్ బ్యాంక్ 0.80 శాతం, కోటక్ మహీంద్ర బ్యాంక్ కూడా 0.80 శాతం, HUL 0.72 శాతం చొప్పున నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
రిలయన్స్-డిస్నీ ఒప్పందం కారణంగా రిలయన్స్ షేర్లు దాదాపు 2 శాతం పెరిగాయి. డీల్ ఎఫెక్ట్ కారణంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు దాదాపు 3 శాతం పతనమయ్యాయి.
NBFC రంగంలోని శ్రీరామ్ ఫైనాన్స్, మార్చి 28 నుంచి బెంచ్‌మార్క్ నిఫ్టీ 50 ఇండెక్స్‌లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ స్టాక్ 2 శాతం జంప్ చేసింది. ఆగ్రోకెమికల్స్ కంపెనీ UPL స్థానాన్ని శ్రీరామ్ ఫైనాన్స్ భర్తీ చేస్తుంది.
ప్రాఫిట్ బుకింగ్స్ కారణంగా ఆయిల్ ఇండియా 2% తగ్గింది. కంపెనీ బోర్డు వచ్చే నెల 8న సమావేశమై, 2వ మధ్యంతర డివిడెండ్‌పై నిర్ణయం తీసుకుంటుంది.
స్టెయిన్‌లెస్ స్టీల్ పైపులు, ట్యూబ్స్స్ (ఫిట్టింగ్స్ బిజినెస్) బిజినెస్‌లోకి వీనస్ పైప్స్ అడుగు పెట్టడంతో, ఈ స్టాక్ 5 శాతం లాభపడింది.
ఈ రోజు ఉదయం 10.05 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 193.44 పాయింట్లు లేదా 0.27% పెరిగి 72,498.32 దగ్గర; NSE నిఫ్టీ 41.65 పాయింట్లు లేదా 0.19% పెరిగి 21,992.80 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
ఈ ఉదయం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.4 శాతం పచ్చగా ఉంది. ఇది మినహా మిగిలిన ఆసియా మార్కెట్లన్నీ ఎరుపు రంగులో ఉన్నాయి. కోస్పి 0.7 శాతం, నికాయ్ 0.5 శాతం, తైవాన్ 0.2 శాతం క్షీణించాయి.
నిన్న, ద్రవ్యోల్బణం డేటాకు ఒకరోజు ముందు, US మార్కెట్లు లోయర్ సైడ్‌లో ముగిశాయి. డౌ జోన్స్, S&P 500 స్వల్పంగా నష్టాల్లో ఉండగా, నాస్‌డాక్ 0.6 శాతం తగ్గింది.
10 సంవత్సరాల US ట్రెజరీ బాండ్ ఈల్డ్ దాదాపు 4.29 శాతంగా ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు దాదాపు $82 వద్ద కదులుతోంది. బిట్‌కాయిన్ ఫుల్ జోష్‌లో ఉంది, 2021 నవంబర్ తర్వాత మొదటిసారిగా $60,000 మార్క్‌ను దాటింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి