Indian Stock Market Opening Today on 17 November 2023: భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు (శుక్రవారం) బ్యాడ్‌ టైమ్‌లో స్టార్ట్‌ అయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్ల పతనంతో, నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల పతనంతో ఓపెన్‌ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ మార్కెట్‌ను మరింత కిందకు లాగింది, ప్రారంభంలోనే 400 పాయింట్లకు పైగా పడిపోయింది. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ఇచ్చే అన్‌-సెక్యూర్డ్‌ లోన్లకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) నిన్న ప్రకటించింది. ఈ కారణంగా బ్యాంకింగ్ & ఆర్థిక సేవల రంగ షేర్లు ఈ రోజు దెబ్బతిన్నాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
నిన్న 65,982 పాయింట్ల వద్ద ఆగిన BSE సెన్సెక్స్, ఈ రోజు 193.69 పాయింట్లు లేదా 0.29 శాతం పతనమై 65,788 స్థాయి వద్ద ప్రారంభమైంది. నిన్న 19,765 పాయింట్ల వద్ద క్లోజయిన NSE నిఫ్టీ, ఈ రోజు 90.45 పాయింట్లు లేదా 0.46 శాతం క్షీణించి 19,674 వద్ద స్టార్ట్‌ అయింది.


బ్యాంక్ నిఫ్టీ భారీ పతనం
ఈ రోజు బిజినెస్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో, బ్యాంక్ నిఫ్టీలో 419 పాయింట్లు లేదా 0.92 శాతం భారీ పతనం కనిపించింది, 43,574 కనిష్ట స్థాయి వద్ద ట్రేడయింది. 


BSEలో అత్యధికంగా నష్టపోయిన టాప్‌-5 స్టాక్స్‌లో అన్నీ బ్యాంకింగ్ & ఫైనాన్స్‌ సెక్టార్‌లోనివే.


బ్యాంకింగ్ & ఫైనాన్స్‌ సెక్టార్‌ ఎందుకు నీరుగారింది?
రిజర్వ్ బ్యాంక్ ‍‌(Reserve Bank of India) నిన్న తీసుకున్న డెసిషన్‌ దీని కారణం. రాబోయే రోజుల్లో ప్రజలు వ్యక్తిగత రుణాలు (personal loan) లేదా క్రెడిట్ కార్డ్‌ (credit card) పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అన్‌-సెక్యూర్డ్‌ లోన్స్‌ విషయంలో రిస్క్‌ వెయిట్‌ను RBI మరో 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది. నిబంధనలు కఠినంగా మారడం వల్ల బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFCలు) వద్ద రుణాలు ఇచ్చే మూలధనం తక్కువ అవుతుంది. దీనివల్ల  రుణాలు, క్రెడిట్ కార్డుల డిస్‌బర్స్‌మెంట్స్‌ తగ్గుతాయి. ఈ వార్తతో, ఈ రోజు, దేశంలో క్రెడిట్‌ కార్డులు జారీ చేసే అతి పెద్ద సంస్థల్లో ఒకటైన SBI కార్డ్ (SBI Card share price today) షేర్‌ ధర 6% క్షీణించింది. సెన్సెక్స్‌లో టాప్‌ లూజర్‌గా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ‍‌(SBI share price today) కూడా 2.40% పతనాన్ని చవిచూసింది.


ఈ రోజు ఉదయం 10.45 గంటల సమయానికి, సెన్సెక్స్‌ 6.37 పాయింట్లులేదా 0.0096% గ్రీన్‌ మార్క్‌తో 65,988.84 స్థాయి వద్ద; నిఫ్టీ 26 పాయింట్లు లేదా 0.13% మెరుగుపడి 19,791.20 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.


మిశ్రమంగా US స్టాక్స్
గురువారం నాడు, S&P 500, నాస్‌డాక్ గురువారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. టెక్ & రిటైల్ జెయింట్స్‌ సిస్కో & వాల్‌మార్ట్‌ మార్కెట్‌ అంచనాలను మిస్‌ అయ్యాయి. ఆ ఒత్తిడితో డౌ ఇండస్ట్రియల్ యావరేజ్ లోయర్‌ సైడ్‌లో ముగిసింది.


పతనంలో ఆసియా షేర్లు
US ఆర్థిక వ్యవస్థలో క్షీణతను అక్కడి డేటా అండర్‌లైన్‌ చేయడంతో బాండ్‌ ఈల్డ్స్‌ పెరిగాయి. దీంతో ఈ రోజు ప్రారంభంలో ఆసియా స్టాక్స్‌ పడిపోయాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial