Stock Market News Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం, 09 ఏప్రిల్‌ 2024) కూడా రికార్డ్ లెవెల్స్‌లో (Stock markets at record levels) ఓపెన్‌ అయ్యాయి. 75000 మార్క్‌ దాటిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 75,124.28 దగ్గర ప్రారంభమైంది, ఇది సెన్సెక్స్‌ ‍(Sensex at fresh all-time high) కొత్త రికార్డ్‌. 22,765.10 స్థాయి వద్ద ప్రారంభమైన నిఫ్టీ, 22,765.30 స్థాయి వద్ద జీవితకాల గరిష్టాన్ని (Nifty at fresh all-time high) నమోదు చేసింది. 


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (సోమవారం) 74,742 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 381.78 పాయింట్లు లేదా 0.51 శాతం పెరుగుదలతో 74,673.84 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. సోమవారం 22,666 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 98.80 పాయింట్లు లేదా 0.44 శాతం లాభంతో 22,765.10 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


బ్యాంక్ నిఫ్టీలోనూ రికార్డ్‌ జంప్‌ కొనసాగుతోంది, ఈ రోజు మళ్లీ ఆల్ టైమ్ హై లెవెల్ 48,829.65 కి చేరుకుంది. బ్యాంక్ నిఫ్టీలో సెంటిమెంట్ ఎక్కువగా ఉంది. PSU బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ఆటో ఇండెక్స్ కూడా బలాన్ని చూపుతోంది. ఐటీ షేర్లలో ర్యాలీ కారణంగా ఐటీ ఇండెక్స్ కూడా పచ్చరంగులో ఉంది. 


విస్తృత మార్కెట్లలో.. BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.17, స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.43 పెరిగాయి.


ప్రారంభ సెషన్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 16 షేర్లు గ్రీన్‌ జోన్‌లో ట్రేడవుతుండగా, మిగిలిన 14 స్టాక్స్ రెడ్‌ జోన్‌లో ఉన్నాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో.. ఇన్ఫోసిస్ 2.02 శాతం, అపోలో హాస్పిటల్స్ 1.29 శాతం పెరిగాయి. హెచ్‌సీఎల్ టెక్, హీరో మోటోకార్ప్, విప్రో, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్ర, టీసీఎస్ కూడా లాభపడ్డాయి. 


నిఫ్టీ50 ప్యాక్‌లో 28 స్టాక్స్‌ లాభాల్లో ట్రేడవుతుండగా, 22 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌ లిస్ట్‌లో.. ఇన్ఫోసిస్, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, విప్రో, టెక్ మహీంద్ర ఉన్నాయి.


BSE మార్కెట్ క్యాపిటలైజేషన్ 401.82 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. నిన్న, మొదటిసారిగా, BSE MCap 400 లక్షల కోట్ల రూపాయలు దాటింది.


ఈ రోజు ఉదయం 10.10 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 315.16 పాయింట్లు లేదా 0.42% పెరిగి 75,057.66 దగ్గర; NSE నిఫ్టీ 88.15 పాయింట్లు లేదా 0.39% పెరిగి 22,754.25 వద్ద ట్రేడవుతున్నాయి. 


గుడి పడ్వా సందర్భంగా మహారాష్ట్రలో ఈ రోజు కరెన్సీ మార్కెట్‌కు సెలవు ఇచ్చారు. భారతీయ మార్కెట్‌లో, రూపాయి తప్ప ఇతర కరెన్సీల్లో ట్రేడింగ్ ఉండదు.


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు ఈ ఉదయం హయ్యర్‌ సైడ్‌లో ఉన్నాయి. జపాన్‌లోని నికాయ్‌ 0.52 శాతం లాభపడగా, బ్రాడ్-బేస్డ్ టోపిక్స్ 0.35 శాతం పెరిగింది. ఆస్ట్రేలియాలో, S&P/ASX 200 0.36 శాతం స్వల్ప పెరుగుదలతో ట్రేడ్‌ ప్రారంభించింది. హాంగ్‌కాంగ్‌లోని హ్యాంగ్‌ సెంగ్ ఇండెక్స్ 1.59 శాతం లాభాల్లో ఉంది. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 0.76 శాతం ఎగబాకగా, స్మాల్ క్యాప్ కోస్‌డాక్ 0.22 శాతం పెరిగింది.


అమెరికన్‌ మార్కెట్లలో, సోమవారం, డౌ జోన్స్‌ & నాస్‌డాక్ దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.03 శాతం, S&P 500 0.04 శాతం తగ్గాయి. నాస్‌డాక్ కాంపోజిట్ 0.03 శాతం పెరిగింది. బుధవారం వెలువడనున్న కీలక ద్రవ్యోల్బణం డేటా కోసం పెట్టుబడిదార్లు ఎదురు చూస్తున్నారు. 


అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ కాస్త తగ్గి 4.41 శాతానికి దిగి వచ్చింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ మళ్లీ $90 పైకి చేరింది. గోల్డ్ ఫ్యూచర్స్ రికార్డ్‌ స్థాయిలో కొనసాగుతోంది, ఔన్సుకు $2,361 దగ్గర ఉంది. 



Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి