Stock Market News Today in Telugu: స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్ ఆగింది, వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఈ రోజు (గురువారం, 07 డిసెంబర్ 2023) దేశీయ స్టాక్ మార్కెట్ మిక్స్‌డ్ ట్రెండ్‌తో ఓపెన్ అయింది. సెన్సెక్స్ స్వల్ప పెరుగుదలతో ప్రారంభం కాగా, నిఫ్టీ నష్టాల్లో స్టార్ట్ అయింది. వరుసగా ఏడు ట్రేడింగ్ సెషన్ల పాటు పెరిగిన పరుగులు పెట్టిన మార్కెట్, ఎనిమిదో రోజైన ఈ రోజు విరామం తీసుకుంది.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
నిన్న (బుధవారం) 69,654 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 40.42 పాయింట్ల స్వల్ప లాభంతో 69,694 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. గత సెషన్‌లో 20,938 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 05 పాయింట్ల స్వల్ప పతనంతో 20,932 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
నిన్నటి సెషన్‌లో నిఫ్టీ, సెన్సెక్స్ జీవితకాల గరిష్టాలను టచ్ చేశాయి. నిఫ్టీ ఆల్ టైమ్ హై లెవెల్ (Nifty fresh all-time high) 20,961.95 కాగా, సెన్సెక్స్ ఆల్ టైమ్ హై లెవెల్ (Sensex fresh all-time high) 69,744.62. ప్రస్తుతం, దేశీయ స్టాక్ మార్కెట్ బుల్లిష్ స్టేజ్‌లో ఉంది. ఈ వారం నిఫ్టీలో 21000 స్థాయిని చూడవచ్చని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేశారు. మార్కెట్ గత 7 సెషన్లలో బాగా పెరిగింది కాబట్టి, ఇన్వెస్టర్లు & ట్రేడర్లు ఈ రోజు లాభాలను బుక్ చేసుకోవడానికి మొగ్గు చూపుతున్న సంకేతాలు కనిపించాయి.
అదానీ గ్రూప్ స్టాక్స్‌లో ఈ రోజు కూడా నార్త్ సైడ్ (పెరుగుదల) మూమెంట్ కనిపించింది.
సెన్సెక్స్‌లో.. HUL, భారతి ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, సన్ ఫార్మా నష్టాలను చవిచూశాయి.
BSE మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.2 శాతం చొప్పున పతనమయ్యాయి. BSE మిడ్ క్యాప్ ప్యాక్‌లో.. BEL, టాటా పవర్ మెరిస్తే, మారికో షేర్లు కాంతివిహీనం అయ్యాయి. BSE స్మాల్ క్యాప్ ప్యాక్‌లో.. ITI, స్పైస్‌జెడ్, MMTC 9% వరకు జూమ్ అయ్యాయి. నెట్‌వర్క్18 నష్టాల్లోకి జారుకుంది.
నిఫ్టీ 50 ప్యాక్‌లో... అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి, NTPC, అదానీ పోర్ట్స్, BPCL, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఫ్రంట్‌లైన్ లాభాల్లో ఉన్నాయి. HUL, ONGC దాదాపు 2% స్లిప్ అయ్యాయి. భారతి ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్, బ్రిటానియా కూడా 1%పైగా నష్టాల్లో ఉన్నాయి.
నిఫ్టీ ఫార్మా, రియాల్టీ సూచీలు మాత్రమే 0.12-0.23 శాతం స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతుండగా, ఇతర రంగాలు ఎరుపు రంగులో ఉన్నాయి.
ఉదయం 10.45 గంటల సమయానికి సెన్సెక్స్ 221.20 పాయింట్లు లేదా 0.32% తగ్గి 69,432.53 స్థాయి వద్ద; నిఫ్టీ 57.25 పాయింట్లు లేదా 0.27% లాస్‌తో 20,880.45 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం (RBI MPC Meeting December 2023)
ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమావేశం బుధవారం ప్రారంభమైంది. MPC నిర్ణయాలు రేపు (శుక్రవారం) తెలుస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగిన గత నాలుగు సమావేశాల్లో రెపో రేట్లు పెరగలేదు. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుండడంతో ఈసారి కూడా వడ్డీ రేట్లు పెంచకపోవచ్చని మార్కెట్ భావిస్తోంది. కాబట్టి వడ్డీ రేట్ల కాకుండా, ఆర్‌బీఐ గవర్నర్ చేసే కామెంట్లు మార్కెట్ ట్రెండ్‌పై ప్రభావం చూపుతాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి