Stock Market News Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఈ రోజు (బుధవారం, 04 సెప్టెంబర్‌ 2024) కలిసిరాకపోవచ్చు. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ భారీ క్షీణతతో సెషన్‌ను స్టార్ట్‌ చేశాయి. ఈ రోజు ట్రేడ్‌లో, ఉదయం నుంచి ఐటీ, టెక్ షేర్లలో భారీ అమ్మకాలు కనిపించాయి. పీఎస్‌యూ బ్యాంక్‌, మెటల్‌ స్టాక్స్‌ కూడా జారిపోయాయి.


ఈ రోజు మన మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (మంగళవారం) 82,555 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 710 పాయింట్ల నష్టంతో 81,845.50 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. మంగళవారం 25,279 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 189 పాయింట్లు పతనమై 25,089.95 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


ట్రేడింగ్‌ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే మార్కెట్‌ స్వల్పంగా కోలుకుంది. ఉదయం 9:22 గంటలకు, సెన్సెక్స్ దాదాపు 550 పాయింట్లు పడిపోయి, 82,000 పాయింట్లకు కొద్దిగా పైన ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 దాదాపు 170 పాయింట్ల నష్టంతో 25,110 పాయింట్ల దగ్గర ఉంది.


నష్టాల్లో దాదాపు అన్ని పెద్ద స్టాక్స్
ప్రారంభ ట్రేడింగ్‌లో, సెన్సెక్స్‌లోని చాలా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. కేవలం 3 స్టాక్స్ ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా. బజాజ్ ఫిన్‌సర్వ్ మాత్రమే గ్రీన్ జోన్‌లో ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ స్క్రిప్స్‌ 1.25 శాతం వరకు క్షీణించాయి. JSW స్టీల్ దాదాపు 2 శాతం పడిపోయింది. L&T, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటన్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ తలో 1 శాతానికి పైగా పడిపోయాయి.


గ్లోబల్ స్టాక్ మార్కెట్ భారీ పతనం
కార్మిక దినోత్సవం సందర్భంగా సోమవారం అమెరికా మార్కెట్‌కు సెలవు. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో వాల్ స్ట్రీట్‌లో భారీ అమ్మకాలు కనిపించాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1.51 శాతం భారీ నష్టాన్ని చవిచూసింది. S&P 500 ఇండెక్స్‌ 2.12 శాతం క్షీణించింది. టెక్-ఫోకస్డ్ ఇండెక్స్ నాస్‌డాక్‌ 3.26 శాతం జారిపోయింది.


అమెరికా మార్కెట్ పతనం ప్రభావం ఈ రోజు ఆసియా మార్కెట్‌పై కూడా కనిపించడంతో ఉదయం సెషన్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఉదయం, జపాన్‌కు చెందిన నిక్కీ 4 శాతానికి పైగా భారీ పతనంతో ట్రేడయింది. టోపిక్స్ ఇండెక్స్ 2.74 శాతం పడిపోయింది. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 2.61 శాతం, కోస్‌డాక్ 2.94 శాతం భారీ నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌కాంగ్‌లోని హ్యాంగ్‌ సెంగ్‌ ఇండెక్స్‌లోనూ బ్యాడ్‌ టైమ్‌ నడిచింది.


ఈ వారం మొదటి రోజే (సోమవారం) ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్ సరికొత్త శిఖరాలకు చేరుకుంది. సెన్సెక్స్ సరికొత్త 'గరిష్ఠ స్థాయి' 82,725.28 పాయింట్లను ‍(Sensex at fresh all-time high) తాకగా, నిఫ్టీ 25,333.65 పాయింట్లతో నూతన 'ఆల్ టైమ్ హై'ని (Nifty at fresh all-time high) సృష్టించింది.


ఈ రోజు ఉదయం 10.00 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 488.28 పాయింట్లు లేదా 0.59% తగ్గి 82,067.16 దగ్గర; NSE నిఫ్టీ 158.90 పాయింట్లు లేదా 0.63% తగ్గి 25,120.95 వద్ద ట్రేడవుతున్నాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: