Stock Market News Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్‌లో బ్లాస్టింగ్ ట్రేడ్ కొనసాగుతోంది. ఈ రోజు (గురువారం, 05 ఏప్రిల్ 2024) దేశీయ మార్కెట్లు మరో నూతన రికార్డు స్థాయి వద్ద (Stock markets at record levels) ప్రారంభమయ్యాయి. ప్రధాన ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ సరికొత్త చారిత్రక శిఖరాన్ని తాకాయి. కేవలం 10 రోజుల వ్యవధిలోనే సెన్సెక్స్, నిఫ్టీ మూడోసారి కొత్త ఆల్‌టైమ్ గరిష్టాన్ని సృష్టించాయి. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ కూడా 48,000 స్థాయిని తాకగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ తొలిసారిగా 50,000 మార్క్‌ను చేరింది. బ్యాంక్ నిఫ్టీతో పాటు మెటల్ స్టాక్స్ కూడా విపరీతమైన వృద్ధితో ఉన్నాయి.
74,500 స్థాయిని దాటిన సెన్సెక్స్ 74,501.73 (Sensex at fresh all-time high) దగ్గర; 22,600 మార్క్‌ను దాటిన NSE నిఫ్టీ 22,619 మార్క్ (Nifty at fresh all-time high) దగ్గర కొత్త జీవిత కాల గరిష్టాలను చేరాయి.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (బుధవారం) 73,877 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 537 పాయింట్లు లేదా 0.73 శాతం జంప్‌తో 74,413.82 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. బుధవారం 22,435 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 157.45 పాయింట్లు లేదా 0.70 శాతం లాభంతో 22,592.10 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
విస్తృత మార్కెట్లలో పాజిటివ్‌నెస్ కంటిన్యూ అయింది. BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం పెరిగాయి.
ప్రారంభ సెషన్‌లో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 28 షేర్లు గ్రీన్ జోన్‌లో ట్రేడవుతుండగా, కేవలం 2 స్టాక్స్ మాత్రమే రెడ్ జోన్‌లో ఉన్నాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.25 శాతం పెరిగి మార్కెట్‌కు భారీ బూస్ట్ ఇచ్చింది. ఎన్‌టీపీసీ 1.28 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.89 శాతం, పవర్‌గ్రిడ్ 0.73 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 0.65 శాతం లాభపడ్డాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, టైటన్, TCS వంటి టాటా గ్రూప్ షేర్లు పెరిగాయి. అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నెస్లే, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఎం&ఎం, హెచ్‌యుఎల్, ఎల్&టి షేర్లు కూడా బలమైన పెరుగుదల కనబరుస్తున్నాయి.
నిఫ్టీ50 ప్యాక్‌లో 45 షేర్లు లాభపడగా, 5 స్టాక్స్ మాత్రమే పతనావస్థలో కనిపించాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో మొత్తం ఐదు స్టాక్స్ బ్యాంకింగ్ రంగానికి చెందినవే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.84 శాతం, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2.52 శాతం పెరిగాయి. బంధన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి.
BSEలో మదుపర్ల సంపద రూ.399.99 లక్షల కోట్లకు చేరుకుంది, రూ.400 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ అంచు వరకు వెళ్లింది.
ఈ రోజు ఉదయం 09.50 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 196.92 పాయింట్లు లేదా 0.27% పెరిగి 74,073.74 దగ్గర; NSE నిఫ్టీ 43.05 పాయింట్లు లేదా 0.19% పెరిగి 22,477.70 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో.. ఈ ఉదయం జపాన్ నికాయ్ 1.5% ర్యాలీ చేసింది. కోస్పి కూడా మిక్స్‌డ్ ట్రెండ్‌లో కాస్త లాభాలు చూసింది. చైనా, హాంకాంగ్, తైవాన్ మార్కెట్లకు ఈ రోజు సెలవు.
ఆర్థిక వ్యవస్థలో బలం, అధిక ద్రవ్యోల్బణం రేటును దృష్టిలో ఉంచుకుని వేచి చూసే విధానానికి కట్టుబడి ఉంటామని US ఫెడరల్ రిజర్వ్ బుధవారం పునరుద్ఘాటించింది. దీంతో, US మార్కెట్లు మిశ్రమ సెంటిమెంట్‌తో ముగిశాయి. S&P 500 0.1 శాతం, నాస్‌డాక్ 0.2 శాతం పెరిగితే, డౌ జోన్స్ 0.1 శాతం పడిపోయింది.
అమెరికాలో బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ పుంజుకుంది, 4.359 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు $90 చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ రికార్డ్ ర్యాలీ కొనసాగుతోంది, ఔన్సుకు $2,321కి చేరింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: క్యాష్, F&Oలో మరో 4 కొత్త సూచీలు - అతి త్వరలో ప్రారంభం