Stock Market News Today in Telugu: సోమవారం ట్రేడింగ్‌ను మిక్స్‌డ్‌గా ముగించిన భారత స్టాక్‌ మార్కెట్లు, ఈ రోజు (మంగళవారం, 02 జనవరి 2024) కూడా నిరాశ ధోరణితో, దాదాపు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. నూతన సంవత్సరం సందర్భంగా చాలా గ్లోబల్‌ మార్కెట్లు నిన్న సెలవు తీసుకోవడంతో, ఇండియన్‌ మార్కెట్లకు అంతర్జాతీయ సిగ్నల్స్‌ అందలేదు. పైగా ఆసియా మార్కెట్లు కూడా మిక్స్‌డ్‌గా ఉన్నాయి. కాబట్టి, ఈ రోజు ఓపెనింగ్‌ టైమ్‌లో మార్కెట్ల స్వల్ప లాభాలతో ప్రారంభమైనా, ఆ తర్వాత వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ 21,700 స్థాయి దిగువకు పడిపోయింది. ఇండివిడ్యువల్‌ స్టాక్స్‌ ఆధారంగానే ఇండెక్స్‌లు పెర్ఫార్మ్‌ చేయాల్సి ఉంటుంది. 


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (సోమవారం, 01 జనవరి 2024) 72,272 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 61 పాయింట్ల లాభంతో 72,332.85 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. శుక్రవారం 21,742 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 09 పాయింట్ల స్వల్ప లాభంతో 21,751.35 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 17 స్టాక్స్‌ నష్టాల్లో ఉన్నాయి. 


సెన్సెక్స్ & నిఫ్టీలో... అల్ట్రాటెక్ సిమెంట్, HUL, ICICI బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఐషర్‌ మోటార్స్, గ్రాసిమ్ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. నెస్లే ఇండియా, భారతి ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కొంత లాభాల్లో ఉన్నాయి.


BSE మిడ్‌ క్యాప్ & స్మాల్‌ క్యాప్ సూచీలు 0.3 శాతం వరకు లాభపడటంతో బ్రాడర్‌ మార్కెట్లు కాస్త మెరుగ్గా ఉన్నాయి. మిడ్‌ క్యాప్ & స్మాల్‌ క్యాప్ సూచీలు తమ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ల కంటే ఔట్‌పెర్ఫార్మ్‌ చేశాయి. 


నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ దాదాపు 2 శాతం పెరిగి ఫుల్‌ జోష్‌లో కనిపించగా, ఇతర రంగాలు మన్ను తిన్న పాముల్లా చురుగ్గా కదల్లేకపోతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియాల్టీ సూచీలు బాగా దెబ్బతిన్నాయి.


Q3 FY24లో US FDA నుంచి ఎనిమిది ఉత్పత్తి ఆమోదాలను పొందడంతో, అలెంబిక్‌ ఫార్మా (Alembic Pharma share price today) షేర్లు 7 శాతం పెరిగాయి. 


క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (QIP) ద్వారా రూ.300 కోట్ల వరకు సేకరించేందుకు డైరెక్టర్ల బోర్డు నుంచి ఆమోదం లభించడంతో, జెన్సోల్ ఇంజనీరింగ్ (Gensol Engineering share price today) స్టాక్‌ 2% లాభపడింది


Q3 FY24లో తన మొత్తం బిజినెస్‌ 11.5 శాతం YoY గ్రోత్‌తో రూ. 24,657 కోట్లకు పెరిగిందని ధనలక్ష్మి బ్యాంక్ బిజినెస్‌ అప్‌డేట్‌ ఇవ్వడంతో, ఈ బ్యాంక్‌ షేర్‌ ప్రైస్‌ ‍‌(Dhanlaxmi Bank share price today) 4% జంప్‌ చేసింది.


ఈ రోజు ఉదయం 10.03 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 366.80 పాయింట్లు లేదా 0.51% తగ్గి 71,905.14 దగ్గర; NSE నిఫ్టీ 86.10 పాయింట్లు లేదా 0.40% తగ్గి 21,655.80 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి 
ఈ ఉదయం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. హాంగ్ సెంగ్, CSI 300 0.9 శాతం వరకు క్షీణించాయి. కోస్పి 0.07 శాతం పతనమైంది. ASX 200 0.22 శాతం పెరిగింది. జపాన్‌లో భారీ భూకంపం వల్ల సునామీ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి మార్కెట్లు మూతపడ్డాయి. జనవరి 01 కారణంగా నిన్న అమెరికన్‌ మార్కెట్లు సెలవు తీసుకున్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి