Stock Market News Updates Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఈ రోజు (మంగళవారం, 10 సెప్టెంబర్‌ 2024) శుభారంభం చేసింది. ట్రేడ్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో మంచి పెరుగుదలను కనబరిచింది. కన్స్యూమర్ డ్యూరబుల్స్ షేర్లలో (0.72 శాతం జంప్‌) ర్యాలీ నుంచి మార్కెట్‌కు గట్టి మద్దతు లభించింది. ఈ రోజు నిఫ్టీలోని అన్ని రంగాల సూచీలు లాభాలతో ట్రేడవుతున్నాయి. మార్కెట్ ప్రారంభమైన వెంటనే నిఫ్టీ కీలకమైన 25,000 స్థాయిని దాటింది. మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా, మెటల్, ఆటో వంటి రంగాలు ముందంజలో ఉన్నాయి. నిఫ్టీ మీడియా 1.4 శాతం లాభంలో టాప్‌ గెయినర్‌గా ఉంది.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..


గత సెషన్‌లో (సోమవారం) 81,559 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 209.18 పాయింట్లు లేదా 0.26 శాతం మంచి లాభంతో 81,768.72 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. సోమవారం 24,936 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 63 పాయింట్లు లేదా 0.25 శాతం గ్రోత్‌తో 24,999.40 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


సెన్సెక్స్ షేర్లలో పచ్చదనం


ఓపెనింగ్‌ ట్రేడ్‌లో, సెన్సెక్స్30 ఇండెక్స్‌ దాదాపు పచ్చగా కనిపిస్తోంది. 30 షేర్లలోని 27 షేర్లు ప్రారంభ సమయానికి పెరుగుదలను చూస్తున్నాయి. ఇన్ఫోసిస్ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఆ తర్వాత.. టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్ షేర్లు ఉన్నాయి.


నిఫ్టీ షేర్ల అప్‌డేట్‌


మార్కెట్ ప్రారంభమయ్యే సమయానికి, నిఫ్టీ50 ఇండెక్స్‌లో ఎక్కువ షేర్లు గ్రీన్‌ జోన్‌లో ఉన్నాయి. హిందుస్థాన్‌ యూనీలీవర్‌ (HUL) టాప్ గెయినర్‌గా ఉంది. నిఫ్టీలోని 50 షేర్లలో 32 షేర్లు ముందుకు దూసుకెళ్తుండగా, 18 షేర్లు పతనంతో తిరోగమిస్తున్నాయి.


ఈ రోజు, దేశీయ స్టాక్ మార్కెట్ ప్రి-ఓపెనింగ్‌ సెషన్‌లో, బీఎస్‌ఈ సెన్సెక్స్ 133.17 పాయింట్లు లేదా 0.16 శాతం పెరిగి 81,692.71 వద్ద ట్రేడవుతోంది.


దేశీయ స్టాక్ మార్కెట్ మార్కెట్ విలువను పరిశీలిస్తే, నిన్న దేశీయ స్టాక్ మార్కెట్ మార్కెట్ క్యాప్ (market capitalization of indian stock market) రూ. 459.99 లక్షల కోట్లుగా ఉంది. ఈ రోజు మంచి వృద్ధితో రూ. 462.82 లక్షల కోట్లకు చేరింది.


అయితే, ఓపెనింగ్‌ గెయిన్స్‌ను ప్రధాన సూచీలు నిలబెట్టుకోలేకపోయాయి. ఈ రోజు ఉదయం 11.15 గంటలకు, BSE సెన్సెక్స్ 65 పాయింట్లు లేదా 0.08% తగ్గి 81,500 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి NSE నిఫ్టీ కూడా 17 పాయింట్లు లేదా 0.06% స్వల్ప నష్టంతో 24,919.30 దగ్గర ట్రేడవుతోంది.


గ్లోబల్‌ మార్కెట్లు


సోమవారం, అమెరికా స్టాక్స్‌ భారీగా పెరిగాయి, డాలర్‌ బలపడింది. USలోని మూడు ప్రధాన స్టాక్ సూచీలు 1 శాతం పైగా పెరిగాయి. S&P 500, డౌ జోన్స్‌ వరుసగా నాలుగు సెషన్ల నష్టాల పరంపరను ముగించాయి. టెక్ స్టాక్స్‌ సమాహారమైన నాస్‌డాక్ కూడా పుంజుకుంది.


యుఎస్‌లో బలమైన ప్రదర్శన ఈ రోజు ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో బలం పెంచింది. జపాన్ నికాయ్‌ ఇండెక్స్ 225 0.52 శాతం పెరిగింది, టోపిక్స్ ఇండెక్స్ 0.65 శాతం పైకి చేరింది. ఆస్ట్రేలియా ASX 200 ఇండెక్స్ 0.69 శాతం లాభపడింది. దక్షిణ కొరియా కోస్పి ఇండెక్స్ 0.17 శాతం పెరిగింది. హాంగ్ కాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ కొద్దిపాటి లాభంలో ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.