Stock Market News Updates Today 09 Oct: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ (RBI MPC) నిర్ణయాలు ఈ రోజు రిలీజ్ కానున్నాయి. దీంతో, ఈ రోజు (బుధవారం, 09 అక్టోబర్ 2024) ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో అద్భుతమైన ప్రారంభం కనిపించింది. సెక్టోరల్ ఇండెక్స్‌లో.. బ్యాంక్ నిఫ్టీ దాదాపు 200 పాయింట్ల పైన స్టార్ట్ అయింది. నిఫ్టీ ఐటీ కూడా 200 పాయింట్లు మెరుగైంది. బ్యాంక్ స్టాక్స్‌లో ఎస్‌బీఐ ఈ రోజు అతి ఎక్కువగా లాభపడింది.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..
గత సెషన్‌లో (మంగళవారం) 81,634 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 319.77 పాయింట్లు లేదా 0.39 శాతం పెరుగుదలతో 81,954.58 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. మంగళవారం 25,013 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 52.65 పాయింట్లు లేదా 0.21 శాతం పెరుగుదలతో 25,065.80 వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
షేర్ల పరిస్థితి
మార్కెట్ ఓపెనింగ్ టైమ్‌లో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 19 స్టాక్స్ పెరుగుదలను చూడగా, 11 స్టాక్‌లు తరుగుదల పాలయ్యాయి. టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, నెస్లే ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోటక్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు టాప్ లూజర్స్‌గా మారాయి.
నిఫ్టీ 50 ప్యాక్‌లో 30 స్టాక్స్ గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్, BPCL, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టాప్ లూజర్స్‌లో ONGC, నెస్లే ఇండియా, జేఎస్‌డబ్ల్యు స్టీల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్ ఉన్నాయి.
సెక్టార్ల వారీగా...
హెల్త్‌కేర్, ఫార్మా సూచీలు అత్యధికంగా లాభపడ్డాయి. ఆటో, ఐటీ, మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియాల్టీ రంగాలు కూడా అధిక స్థాయిలో ట్రేడవుతున్నాయి. మెటల్ ఇండెక్స్ 0.41 శాతం క్షీణించింది. ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు దిగువ స్థాయిలో ఉన్నాయి.
విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.87 శాతం ముందంజలో ఉండగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీ 0.94 శాతం పెరిగింది.
భారతీయ సెంట్రల్ బ్యాంక్ నిర్ణయాలు మరికాసేపట్లో వెల్లడవుతాయి. ఈసారి కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండవని మార్కెట్ భావిస్తోంది. అయితే, ద్రవ్యోల్బణం అంచనాలు & GDP వృద్ధి అంచనాలపై RBI గవర్నర్ చేసే వ్యాఖ్యలు కీలకంగా మారతాయి.
ఉదయం 09.45 గంటలకు, సెన్సెక్స్ 209.34 పాయింట్లు లేదా 0.26% పెరిగి 81,844.16 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి నిఫ్టీ 77.40 పాయింట్లు లేదా 0.31% పెరిగి 25,090.55 దగ్గర ట్రేడవుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఓలా ఎలక్ట్రిక్‌కు మరో షాక్ - స్వయంగా రంగంలోకి రవాణా మంత్రిత్వ శాఖ