Stock Market News: ఇండియన్‌ ఈక్విటీస్‌లో (షేర్లలో), ఇన్సూరెన్స్ కంపెనీల పెట్టుబడుల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా (LIC) రారాజు. వివిధ కంపెనీల్లో షేర్లు కొనడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టిన మొత్తం పెట్టుబడుల్లో సింహభాగం (70% షేర్ లేదా రూ. 10.91 లక్షల కోట్లు) వాటా ఎల్‌ఐసీదే. ప్రైమ్ డేటాబేస్ ప్రకారం... 268 కంపెనీల్లో ఎల్‌ఐసీ హోల్డింగ్ కనీసం 1% కంటే ఎక్కువే ఉంది. ఈ 268 కంపెనీల్లో... 2022 సెప్టెంబర్‌ త్రైమాసికం చివరి నాటికి ఉన్న ఎల్‌ఐసీ పెట్టుబడి 3.87% నుంచి డిసెంబర్‌ త్రైమాసికం చివరి నాటికి 3.95% కు పెరిగింది. 1% కంటే తక్కువ పెట్టుబడులు ఉన్న కంపెనీలు కూడా వందల కొద్దీ ఉన్నాయి. 


అయితే, డిసెంబర్‌ త్రైమాసికంలో, NSE బాస్కెట్‌లో ఉన్న 108 కంపెనీల్లో ఈ బీమా కంపెనీ హోల్డింగ్ తగ్గింది. విలువ పరంగా అత్యధిక తగ్గుదలను చూసిన టాప్‌-10 బాధిత కంపెనీలు ఇవి: 


హిందుస్థాన్‌ యూనిలీవర్‌ (Hindustan Unilever)
సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే సమయానికి LIC హోల్డింగ్స్ విలువ: రూ. 30,261 కోట్లు
డిసెంబర్‌ త్రైమాసికంలో ఎంత తగ్గింది: రూ. 4,092 కోట్లు
డిసెంబర్‌ త్రైమాసికం చివరి నాటికి LIC హోల్డింగ్స్ విలువ: రూ. 26,169 కోట్లు


టైటన్‌ (Titan)
సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే సమయానికి LIC హోల్డింగ్స్ విలువ: రూ. 7,551 కోట్లు
డిసెంబర్‌ త్రైమాసికంలో ఎంత తగ్గింది: రూ. 2,221 కోట్లు
డిసెంబర్‌ త్రైమాసికం చివరి నాటికి LIC హోల్డింగ్స్ విలువ: రూ. 5,330 కోట్లు


అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission)
సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే సమయానికి LIC హోల్డింగ్స్ విలువ: రూ. 12,706 కోట్లు
డిసెంబర్‌ త్రైమాసికంలో ఎంత తగ్గింది: రూ. 2,174 కోట్లు
డిసెంబర్‌ త్రైమాసికం చివరి నాటికి LIC హోల్డింగ్స్ విలువ: రూ. 10,532 కోట్లు


ఎన్‌టీపీసీ (NTPC)
సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే సమయానికి LIC హోల్డింగ్స్ విలువ: రూ. 13,332 కోట్లు
డిసెంబర్‌ త్రైమాసికంలో ఎంత తగ్గింది: రూ. 2,136 కోట్లు
డిసెంబర్‌ త్రైమాసికం చివరి నాటికి LIC హోల్డింగ్స్ విలువ: రూ. 11,197 కోట్లు


మారుతి సుజుకీ (Maruti Suzuki India)
సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే సమయానికి LIC హోల్డింగ్స్ విలువ: రూ. 9,152 కోట్లు
డిసెంబర్‌ త్రైమాసికంలో ఎంత తగ్గింది: రూ. 1,998 కోట్లు
డిసెంబర్‌ త్రైమాసికం చివరి నాటికి LIC హోల్డింగ్స్ విలువ: రూ. 7,154 కోట్లు


మహీంద్ర & మహీంద్ర (Mahindra and Mahindra)
సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే సమయానికి LIC హోల్డింగ్స్ విలువ: రూ. 9,388 కోట్లు
డిసెంబర్‌ త్రైమాసికంలో ఎంత తగ్గింది: రూ. 1,521 కోట్లు
డిసెంబర్‌ త్రైమాసికం చివరి నాటికి LIC హోల్డింగ్స్ విలువ: రూ. 7,867 కోట్లు


పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ‍(Power Grid Corp)
సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే సమయానికి LIC హోల్డింగ్స్ విలువ: రూ. 5,026 కోట్లు
డిసెంబర్‌ త్రైమాసికంలో ఎంత తగ్గింది: రూ. 1,409 కోట్లు
డిసెంబర్‌ త్రైమాసికం చివరి నాటికి LIC హోల్డింగ్స్ విలువ: రూ. 3,617 కోట్లు


బజాజ్‌ ఫిన్‌సెర్వ్‌ ( Bajaj Finserv)
సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే సమయానికి LIC హోల్డింగ్స్ విలువ: రూ. 4,341 కోట్లు
డిసెంబర్‌ త్రైమాసికంలో ఎంత తగ్గింది: రూ. 1,287 కోట్లు
డిసెంబర్‌ త్రైమాసికం చివరి నాటికి LIC హోల్డింగ్స్ విలువ: రూ. 3,054 కోట్లు


సన్‌ ఫార్మా (Sun Pharma)
సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే సమయానికి LIC హోల్డింగ్స్ విలువ: రూ. 9,977 కోట్లు
డిసెంబర్‌ త్రైమాసికంలో ఎంత తగ్గింది: రూ. 1,221 కోట్లు
డిసెంబర్‌ త్రైమాసికం చివరి నాటికి LIC హోల్డింగ్స్ విలువ: రూ. 8,756 కోట్లు


బీపీసీఎల్ (BPCL)
సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే సమయానికి ఈ కంపెనీలో LIC హోల్డింగ్‌ 1% పైగా ఉంది, డిసెంబర్‌ త్రైమాసికంలో అది 1% లోపునకు పడిపోయింది. 1% లోపు హోల్డింగ్‌ ఉన్న కంపెనీల్లో వాటా వివరాలు అందుబాటులో ఉండవు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.