Stock Market Opening on 31 October 2023: దేశీయ స్టాక్స్‌లో మొమెంటం కంటిన్యూ కావడంతో పాటు గ్లోబల్ మార్కెట్ల ప్రత్యేక మద్దతు ప్రభావం కూడా భారత మార్కెట్‌పై కనిపిస్తోంది. దేశీయ సంకేతాల్లో.. హెవీవెయిట్‌ల పెరుగుదల మార్కెట్‌ జోరును పెంచింది. టాటా స్టాక్స్, బజాజ్ ట్విన్స్ వృద్ధి ప్రభావం భారత మార్కెట్లపై కనిపిస్తోంది.


ఈ రోజు మార్కెట్‌ ఇలా ప్రారంభమైంది
భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు (మంగళవారం, 31 అక్టోబర్‌ 2023) అద్భుతమైన ఊపుతో ప్రారంభమైంది, సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ సాధించింది. BSE సెన్సెక్స్ 337 పాయింట్లు లేదా 0.53 శాతం జంప్‌తో 64,449 స్థాయి వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. NSE నిఫ్టీ 92 పాయింట్లు లేదా 0.48 శాతం భారీ లాభంతో 19,232 స్థాయి వద్ద ప్రారంభమైంది.


బ్యాంక్ నిఫ్టీ విపరీతంగా పెరిగినా...
ఓపెనింగ్‌ సెషన్‌లో, బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు గరిష్ఠ స్థాయి 43,356కి చేరుకుంది. ఆ తర్వాత, ఉదయం 9.30 గంటలకు రోజు గరిష్ఠ స్థాయి నుంచి 257 పాయింట్లు క్షీణించి 43,102 స్థాయి వద్ద కనిపిస్తోంది. అయినా, చాలా బ్యాంకింగ్ స్టాక్స్‌లో బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతోంది. కొన్ని PSU బ్యాంక్ షేర్లు పెరుగుతూనే ఉన్నాయి.


మార్కెట్‌ ఆరంభంలో, 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 26 కౌంటర్లు గ్రీన్‌లో కనిపించించాయి, 4 మాత్రమే రెడ్‌ జోన్‌లో ఉన్నాయి. ఆ సమయానికి టాటా మోటార్స్ 1.25 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.90 శాతం లాభాల్లో ఉన్నాయి. నెస్లే షేర్లు 0.65 శాతం, టాటా స్టీల్ 0.60 శాతం లాభపడ్డాయి.


ప్రి-మార్కెట్
స్టాక్ మార్కెట్ ప్రి-ఓపెనింగ్‌లో, BSE సెన్సెక్స్ 511 పాయింట్లు లేదా 0.80 శాతం పెరుగుదలతో 64,623 స్థాయి వద్ద ట్రేడయింది. NSE నిఫ్టీ 301.75 పాయింట్లు లేదా 1.58 శాతం వృద్ధితో 19,442 స్థాయి వద్ద కదిలింది.


భారీగా పెరిగిన అమెరికన్‌ మార్కెట్లు
నిన్న అమెరికన్ మార్కెట్లు విపరీతంగా ర్యాలీ చేశాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 511 పాయింట్లు లేదా 1.58 శాతం జంప్‌తో 32,928 స్థాయి వద్ద ట్రేడ్‌ను ముగించింది. నాస్‌డాక్ కాంపోజిట్ ఇండెక్స్ కూడా 146 పాయింట్లు లేదా 1.16 శాతం పెరిగి 12,789 స్థాయి వద్ద క్లోజ్‌ అయింది. S&P 500 ఇండెక్స్ 1.2 శాతం పెరిగి 4,166 స్థాయి వద్ద ఆగింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial