High Dividend Yield Stocks: మన దేశంలోని పెద్ద బ్యాంకులు గరిష్టంగా 7.10% ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, బ్యాంక్ వడ్డీ కంటే ఎక్కువ రాబడి ఆర్జించడానికి ఎక్కువ డివిడెండ్ ఇచ్చే స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, డివిడెండ్ ఈల్డ్ శాశ్వతం కాదన్న విషయాన్ని పెట్టుబడిదార్లు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇవి రుణ సాధనాల్లాంటివి (debt instruments) కాదు, మార్కెట్‌లోని హెచ్చుతగ్గులు డివిడెండ్ రాబడిని ప్రభావితం చేస్తాయి.
ఫిబ్రవరి 22, 2023 నాటికి, BSE 500 లిస్ట్‌లో, 8% పైగా డివిడెండ్ ఈల్డ్ ఇచ్చిన టాప్ 9 స్టాక్స్ ఇవి:
వేదాంత
2023 ఫిబ్రవరి 22 నాటికి, ఈ కంపెనీ డివిడెండ్ ఈల్డ్ 14.83% వద్ద ఉంది. గత నెల రోజుల్లో ఈ స్టాక్ దాదాపు 8.34% పడిపోయింది. ప్రస్తుతం ఇది రూ. 303.35 వద్ద ట్రేడవుతోంది. దాని 52-వారాల గరిష్ట స్థాయిని మళ్లీ పరీక్షించాలంటే ఇది 45.29% ర్యాలీ చేయాలి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
ఫిబ్రవరి 22 నాటికి కంపెనీ డివిడెండ్ ఈల్డ్ 14.75% వద్ద ఉంది. గత నెల రోజుల్లో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్టాక్ దాదాపు 6.76% పడిపోయింది. ప్రస్తుతం ఇది రూ. 77.30 వద్ద ట్రేడవుతోంది. దాని 52 వారాల గరిష్ఠ స్థాయిని మళ్లీ పరీక్షించాలంటే ఇది 17.29% ర్యాలీ చేయాలి.
REC
ఫిబ్రవరి 22 నాటికి కంపెనీ డివిడెండ్ ఈల్డ్ 13.64% వద్ద ఉంది. గత నెల రోజుల్లో ఈ కౌంటర్ దాదాపు 9.63% నష్టపోయింది. ప్రస్తుతం రూ.112.15 వద్ద ట్రేడవుతోంది. దాని 52 వారాల గరిష్ట స్థాయిని మళ్లీ పరీక్షించాలంటే దీనికి 12.62% ర్యాలీ అవసరం.
గెయిల్ (ఇండియా)
ఫిబ్రవరి 22 నాటికి కంపెనీ డివిడెండ్ ఈల్డ్ 10.47% వద్ద ఉంది. గత నెల రోజుల్లో గెయిల్ షేర్ ధర దాదాపు 3.48% పడిపోయింది. ప్రస్తుతం స్టాక్ రూ. 95.55 వద్ద ట్రేడవుతోంది. దాని 52 వారాల గరిష్ఠ స్థాయిని మళ్లీ పరీక్షించాలంటే ఈ స్క్రిప్ 21.02% ర్యాలీ చేయాలి.
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)
ఫిబ్రవరి 22 నాటికి కంపెనీ డివిడెండ్ ఈల్డ్ 10.34% వద్ద ఉంది. గత ఒక నెలలో స్టాక్ సుమారు 7.54% పడిపోయింది. ప్రస్తుతం SAIL రూ. 84.60 వద్ద ట్రేడవుతోంది. దాని 52-వారాల గరిష్ట స్థాయిని మళ్లీ పరీక్షించాలంటే అది 32.74% ర్యాలీ చేయాలి.
సనోఫీ ఇండియా
ఫిబ్రవరి 22 నాటికి కంపెనీ డివిడెండ్ ఈల్డ్ 9.07% వద్ద ఉంది. గత నెల రోజుల్లో, స్టాక్ దాదాపు 4.93% పడిపోయింది. ప్రస్తుతం ఇది రూ. 5401.05 వద్ద ట్రేడవుతోంది. అయితే దాని 52 వారాల గరిష్ఠ స్థాయిని మళ్లీ పరీక్షించడానికి ఇది 46.99% ర్యాలీ చేయాలి
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్
ఫిబ్రవరి 22 నాటికి కంపెనీ డివిడెండ్ ఈల్డ్ 8.20% వద్ద ఉంది. గత ఒక నెలలో, స్టాక్ దాదాపు 2.66% పడిపోయింది. ప్రస్తుతం PFC షేర్లు రూ. 146.40 వద్ద ట్రేడవుతున్నాయి, అయితే, దాని 52-వారాల గరిష్ట స్థాయిని మళ్లీ పరీక్షించాలంటే ఈ స్టాక్ 10.59% ర్యాలీ చేయాలి.
కోల్ ఇండియా
ఫిబ్రవరి 22 నాటికి కంపెనీ డివిడెండ్ ఈల్డ్ 8.03% వద్ద ఉంది. గత నెల రోజుల్లో, స్టాక్ దాదాపు 6.68% పడిపోయింది. ప్రస్తుతం స్టాక్ రూ. 211.80 వద్ద ట్రేడవుతోంది. దాని 52-వారాల గరిష్ట స్థాయిని మళ్లీ పరీక్షించడానికి ఇది 24.32% ర్యాలీ చేయాలి
నేషనల్ అల్యూమినియం కంపెనీ
ఫిబ్రవరి 22 నాటికి కంపెనీ డివిడెండ్ ఈల్డ్ 8.01% వద్ద ఉంది. గత నెల రోజుల్లో, స్టాక్ దాదాపు 3.22% పడిపోయింది. ప్రస్తుతం ఈ షేరు రూ. 81.15 వద్ద ట్రేడవుతోంది. దాని 52 వారాల గరిష్ఠ స్థాయిని మళ్లీ పరీక్షించాలంటే 63.59% ర్యాలీ చేయాలి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.