Stock Market news: 55 కంపెనీల ప్రమోటర్లు "బయ్ ఆన్ డిప్" (షేర్ ధర పడిపోయినప్పుడు కొనడం) సూత్రాన్ని చక్కగా ఫాలో అయ్యారు. గత రెండు నెలలుగా స్టాక్ ధరలు క్షీణించడంతో... జనవరి 1 నుంచి తమ కంపెనీల షేర్లను బహిరంగ మార్కెట్ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, కంపెనీలో తమ వాటాను పెంచుకుంటూ వెళ్లారు. UPL, హెచ్‌సీఎల్ టెక్, ఆర్తి ఫార్మాలాబ్స్, బజాజ్ హోల్డింగ్స్, క్వెస్ కార్ప్, ఎరిస్ లైఫ్‌సైన్సెస్, జిందాల్ సా, వెల్‌స్పన్ కార్ప్, శోభ, జెన్సార్ టెక్నాలజీస్ ఈ లిస్ట్‌లో ఉన్న కొన్ని కంపెనీలు.
జనవరి 1 నుంచి నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 3-5% మధ్య క్షీణించాయి. కొన్ని స్మాల్ & మిడ్ క్యాప్ స్టాక్స్ 10-35% రేంజ్‌లో పతనమయ్యాయి. ఈ దిగుడు మెట్లను తమ ప్రగతి మెట్లుగా ప్రమోటర్లు మార్చుకున్నారు.
ప్రమోటర్ల హోల్డింగ్ పెరిగిన కొన్ని ఫేమస్ కంపెనీలు:
కంపెనీ పేరు: UPL
జనవరి & ఫిబ్రవరిలో ప్రమోటర్లు కొన్న షేర్లు (లక్షల్లో): 37.04
కొన్న షేర్ల విలువ (రూ.కోట్లలో): 530.86
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిటర్న్స్: -1.43
ప్రస్తుతం ప్రమోటర్ హోల్డింగ్: 30.74
కంపెనీ పేరు: HCL Technologies
జనవరి & ఫిబ్రవరిలో ప్రమోటర్లు కొన్న షేర్లు (లక్షల్లో): 17.99
కొన్న షేర్ల విలువ (రూ.కోట్లలో): 198.73
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిటర్న్స్: 6.41
ప్రస్తుతం ప్రమోటర్ హోల్డింగ్: 60.72
కంపెనీ పేరు: Aarti Pharmalabs
జనవరి & ఫిబ్రవరిలో ప్రమోటర్లు కొన్న షేర్లు (లక్షల్లో): 15.21
కొన్న షేర్ల విలువ (రూ.కోట్లలో): 47.34
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిటర్న్స్: -20
ప్రస్తుతం ప్రమోటర్ హోల్డింగ్: 44.16
కంపెనీ పేరు: Bajaj Holdings
జనవరి & ఫిబ్రవరిలో ప్రమోటర్లు కొన్న షేర్లు (లక్షల్లో): 0.38
కొన్న షేర్ల విలువ (రూ.కోట్లలో): 22.91
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిటర్న్స్: 8.56
ప్రస్తుతం ప్రమోటర్ హోల్డింగ్: 51.36
కంపెనీ పేరు: Quess Corp
జనవరి & ఫిబ్రవరిలో ప్రమోటర్లు కొన్న షేర్లు (లక్షల్లో): 5.35
కొన్న షేర్ల విలువ (రూ.కోట్లలో): 19.97
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిటర్న్స్: -12
ప్రస్తుతం ప్రమోటర్ హోల్డింగ్: 51.90
కంపెనీ పేరు: Eris Lifesciences
జనవరి & ఫిబ్రవరిలో ప్రమోటర్లు కొన్న షేర్లు (లక్షల్లో): 2.15
కొన్న షేర్ల విలువ (రూ.కోట్లలో): 13.51
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిటర్న్స్: -2.27
ప్రస్తుతం ప్రమోటర్ హోల్డింగ్: 52.70
కంపెనీ పేరు: Jindal Saw
జనవరి & ఫిబ్రవరిలో ప్రమోటర్లు కొన్న షేర్లు (లక్షల్లో): 7.75
కొన్న షేర్ల విలువ (రూ.కోట్లలో): 9.54
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిటర్న్స్: 41.52
ప్రస్తుతం ప్రమోటర్ హోల్డింగ్: 63.03
కంపెనీ పేరు: Welspun Corp
జనవరి & ఫిబ్రవరిలో ప్రమోటర్లు కొన్న షేర్లు (లక్షల్లో): 2.35
కొన్న షేర్ల విలువ (రూ.కోట్లలో): 4.88
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిటర్న్స్: -18
ప్రస్తుతం ప్రమోటర్ హోల్డింగ్: 49.90
కంపెనీ పేరు: Sobha
జనవరి & ఫిబ్రవరిలో ప్రమోటర్లు కొన్న షేర్లు (లక్షల్లో): 0.80
కొన్న షేర్ల విలువ (రూ.కోట్లలో): 4.69
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిటర్న్స్: -2.37
ప్రస్తుతం ప్రమోటర్ హోల్డింగ్: 51.99
కంపెనీ పేరు: Zensar Technologies
జనవరి & ఫిబ్రవరిలో ప్రమోటర్లు కొన్న షేర్లు (లక్షల్లో): 1.80
కొన్న షేర్ల విలువ (రూ.కోట్లలో): 4.09
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిటర్న్స్: 30
ప్రస్తుతం ప్రమోటర్ హోల్డింగ్: 49.15
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.