Nifty Smallcap Stocks: గత దీపావళి నుంచి ఈ దీపావళి మధ్యకాలంలో చాలా మార్పులు జరిగాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి మారిపోయింది. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. అయినా, స్థూల ఆర్థిక అనిశ్చితుల కారణంగా దీపావళి-దీపావళి మధ్యకాలంలో మార్కెట్లు తీవ్ర అస్థిరతను అనుభవించాయి. అన్ని రంగాల సూచీల్లో పదునైన దిద్దుబాటుకు దారి తీసింది. గుడ్డిలో మెల్లలాగా, దీని వల్ల వాల్యూ బయింగ్‌కు అవకాశం ఏర్పడింది. ఐదు నిఫ్టీ స్మాల్ క్యాప్ స్టాక్స్ గత దీపావళి నుంచి ఈ దీపావళి మధ్యలో 100% కంటే ఎక్కువ లాభాలతో మల్టీ-బ్యాగర్స్‌గా ఉద్భవించాయి. దీర్ఘకాలిక అవకాశాలను అందుకోవడానికి సానుకూల స్థానంలో ఉన్నాయి.
నిఫ్టీ స్మాల్ క్యాప్-100 ఇచ్చిన రిటర్న్స్‌ను అధిగమించి, పెట్టుబడిదారులకు ఏడాదిలోనే ట్రిపుల్ డిజిట్ రాబడిని అందించిన ఐదు స్మాల్ క్యాప్ స్టాక్‌ల లిస్ట్ ఇది:
1. దీపక్ ఫెర్టిలైజర్స్ (Deepak Fertilizers and Petrochemicals Corporation)
ఈ నెల 21, NSEలో, దీపక్ ఫెర్టిలైజర్స్ షేరు ముగింపు ధర ₹1,031.05. ఆ రోజున ఈ షేరు కొత్త 52 వారాల గరిష్ట స్థాయి ₹1,062ని తాకింది.
ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం, దీపక్ ఫెర్టిలైజర్స్ డివిడెండ్ ఈల్డ్ 0.87% వద్ద ఉంది.
గతేడాది దీపావళి నుంచి ఈ షేరు NSEలో దాదాపు 157% లాభపడింది. 2021 నవంబర్ 3న ఒక్కో షేరు దాదాపు ₹401.80గా ఉంది. గత ఏడాది నవంబర్ 23న ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి ₹343.55కి చేరింది.
52 వారాల కనిష్ట స్థాయితో పోలిస్తే, దీపక్ ఫెర్టిలైజర్స్ స్టాక్ ఇప్పటి వరకు 200% పైగా పెరిగింది.
FY22లో, వాటాదారులకు ఒక్కో ఈక్విటీ షేరుకు ₹9 చొప్పున మొత్తం 90% డివిడెండ్‌ను దీపక్ ఫెర్టిలైజర్స్ చెల్లించింది.
2. శ్రీ రేణుకా షుగర్స్ (Shree Renuka Sugars)
అక్టోబర్ 25న, NSEలో స్టాక్ ముగింపు ధర ₹57.25గా ఉంది. అక్టోబర్ 11న ఈ షేరు కొత్త 52 వారాల గరిష్ట స్థాయి ₹68.75ను తాకింది.
గత దీపావళిలో, నవంబర్ 3న NSEలో షేరు ధర దాదాపు ₹26.40గా ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ స్టాక్ 122.16% పెరిగింది. గత ఏడాది నవంబర్ 30న స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయి ₹24.40ని తాకింది. ఈ కనిష్ట స్థాయితో పోలిస్తే స్టాక్ ఇప్పటి వరకు 140.37% పెరిగింది.
3. ఎల్గీ ఎక్విప్‌మెంట్స్ (Elgi Equipments)
NSEలో, బుధవారం ఈ స్టాక్ 3.68% పెరిగి ఒక్కొక్కటి ₹524 వద్ద ముగిసింది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం, కంపెనీ డివిడెండ్ ఈల్డ్ దాదాపు 0.23%.
గత నెలలో, ఎల్గీ స్టాక్ 52 వారాల గరిష్ఠ స్థాయి ₹566.60ని తాకింది.
2021 నవంబర్ 3న, ఒక్కో స్టాక్ ₹200 కంటే తక్కువలో, ₹199.85 వద్ద ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 146% పైగా పెరిగింది. 2021 అక్టోబర్ 25న నమోదైన 52 వారాల కనిష్ట స్థాయి ₹195.10 నుంచి ఇప్పటి వరకు ఈ స్టాక్ 152% పైనే పెరిగింది.
FY22 ఆర్థిక సంవత్సరానికి వాటాదారులకు ఒక్కో ఈక్విటీ షేరుకు ₹1.15 చొప్పున మొత్తం 115% డివిడెండ్ చెల్లించింది.
4. భారత్ డైనమిక్స్ (Bharat Dynamics)
NSEలో, ఈ షేరు ధర 3% పెరిగి ₹992 వద్ద ముగిసింది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం, కంపెనీ డివిడెండ్ ఈల్డ్ దాదాపు 0.87%.
ఈ షేరు 52 వారాల గరిష్ట స్థాయి 1,008.70.
గత ఏడాది నవంబర్ 3న, ఒక్కో షేరు ₹423.75 దగ్గర ఉంది. ఈ స్థాయి నుంచి ఈ రోజు వరకు దాదాపు 135% పెరిగింది, గత ఏడాది నవంబర్‌లో ఈ స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయి ₹370ని కూడా తాకింది. అప్పటి నుంచి ఇది 165% పైగా పెరిగింది.
FY22లో, ఈ సంస్థ తన వాటాదారులకు ఒక్కో ఈక్విటీ షేరుకు ₹8.3 చొప్పున మొత్తం 83% డివిడెండ్ చెల్లించింది.
5. కేపీఐటీ టెక్నాలజీస్ (KPIT Technologies)
NSEలో, మంగళవారం 1.77% పెరిగి షేరు ఒక్కొక్కటి ₹725.50 వద్ద ముగిసింది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం, కంపెనీ డివిడెండ్ ఈల్డ్ దాదాపు 0.44%.
ఈ స్టాక్ జనవరి 10, 2022న 52 వారాల గరిష్ట స్థాయి ₹801కి చేరుకుంది.
గత సంవత్సరం నవంబర్ 3న, స్టాక్ ధర ₹344.75 వద్ద ఉంది. గత దీపావళి నుంచి దాదాపు 105.6% లాభపడింది. 2021 అక్టోబర్ 29న నమోదైన 52 వారాల కనిష్ట స్థాయి ₹300.25 నుంచి లెక్కేస్తే, ఈ స్టాక్ ఈ రోజు వరకు 137% పైగా పురోగమించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.