Stock Market News Updates Today 04 Oct: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య కమ్ముకుంటున్న యుద్ధ మేఘాల నీడ ఈ రోజు (శుక్రవారం, 04 అక్టోబర్‌ 2024) కూడా భారతీయ మార్కెట్ల మీద పడింది. ఇజ్రాయెల్ & దాని మిత్రదేశాలు ఒకవైపు - ఇరాన్ & దాని మద్దతుదార్లు మరోవైపు చేరి ఉద్రిక్తతలు పెంచుతుండేసరికి ప్రపంచ మార్కెట్ల బలహీనపడ్డాయి. ఆ బలహీనత భారతీయ బెంచ్‌మార్క్ సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో, శుక్రవారం కూడా ఇండియన్‌ ఈక్విటీలు డౌన్‌ సైడ్‌లో ప్రారంభమయ్యాయి. అయితే, కీలకమైన సపోర్ట్‌ లెవెల్స్‌ నుంచి తిరిగి పుంజుకునే ప్రయత్నం చేస్తున్నాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..


గత సెషన్‌లో (గురువారం) 82,497 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 253 పాయింట్లు లేదా 0.31 శాతం క్షీణించి 82,244.25 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గురువారం 25,250 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 0 68 పాయింట్లు లేదా 0.27 శాతం పడిపోయి 25,181.90 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


షేర్ల పరిస్థితి
సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో సగానికి పైగా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్ 2.52 శాతం క్షీణించి టాప్‌ లూజర్‌గా ఉంది. ఏషియన్ పెయింట్, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్ కూడా మార్కెట్‌ను దిగలాగే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు.. TCS 0.86 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌సీఎల్ టెక్, ITC ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


నిఫ్టీ 50 ప్యాక్‌లో.. JSW స్టీల్ ‍(1.33 శాతం పెరుగుదల), ONGC ‍(0.36 శాతం పెరుగుదల) మాత్రమే లాభపడగా, మిగిలిన 48 షేర్లు తిరోగమనం బాట పడ్డాయి. ఆ నష్టాలకు BPCL (3.11 శాతం క్షీణత) నాయకత్వం వహిస్తోంది. బజాజ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్‌, ట్రెంట్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


రంగాల వారీగా...
IT మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఐటీ 0.23 శాతం పెరిగింది. నిఫ్టీ రియల్టీ 2.65 శాతం క్షీణించింది. మెటల్, మీడియా సూచీలు దీనిని ఫాలో అవుతున్నాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, హెల్త్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ & గ్యాస్ కూడా నష్టాల్లో ఉన్నాయి.


బ్రాడర్ మార్కెట్లలో.. BSE స్మాల్ క్యాప్ ఇండెక్స్‌ 1.48 శాతం, BSE మిడ్ క్యాప్ ఇండెక్స్‌ 1.37 శాతం క్షీణించాయి.


ఉదయం 10.00 గంటలకు, సెన్సెక్స్ 52.72 పాయింట్లు లేదా 0.06% పెరిగి 82,549.82 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి నిఫ్టీ 41.55 పాయింట్లు లేదా 0.16% పెరిగి 25,291.65 దగ్గర ట్రేడవుతోంది.


నిన్న అతి భారీ నష్టాలు
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలతో అక్టోబర్ 3, గురువారం నాడు భారతీయ స్టాక్ మార్కెట్‌లో బ్లడ్‌బాత్‌ జరిగింది. సెన్సెక్స్ 1,769 పాయింట్లు లేదా 2 శాతం పతనమై 82,497 స్థాయిల వద్ద ముగియగా, నిఫ్టీ 547 పాయింట్లు లేదా 2.12 శాతం క్షీణించి 25,300 మార్కును కోల్పోయి, 25,250 వద్ద ముగిసింది.


గ్లోబల్‌ మార్కెట్లు
ఈ రోజు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని S&P/ASX 200 ఇండెక్స్‌ 0.98 శాతం పడిపోయింది. జపాన్‌కు చెందిన నికాయ్‌ 0.11 శాతం పెరిగింది, టోపిక్స్‌ 0.27 శాతం పెరిగింది. దక్షిణ కొరియాలోని కోస్పి 0.78 శాతం, కోస్‌డాక్ 1.61 శాతం ర్యాలీ చేశాయి. హాంగ్ కాంగ్‌కు చెందిన హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.48 శాతం లాభపడింది. చైనా మార్కెట్లు అక్టోబర్ 8 వరకు క్లోజ్‌లో ఉంటాయి.


గురువారం, వాల్‌స్ట్రీట్‌లో... డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.44 శాతం క్షీణించి 42,011.59 వద్దకు, S&P 500 0.17 శాతం క్షీణించి 5,699.94 వద్దకు, నాస్‌డాక్ కాంపోజిట్ 0.04 శాతం పడిపోయి 17,918.48 వద్దకు చేరాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: భారంగా మారుతున్న క్రెడిట్‌ కార్డ్‌ను ఇలా క్లోజ్ చేయండి!