Stock Market Holidays in 2024: అయోధ్య రామాలయంలో ‍‌(Ayodhya Ram mandir) ప్రాణ ప్రతిష్ట సందర్భంగా, సోమవారం (22 జనవరి 2024) స్టాక్‌ మార్కెట్లు పని చేయవు. ఆ రోజు ఈక్విటీలు సహా అన్ని విభాగాల్లో ట్రేడింగ్‌ జరగదు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. అందువల్ల స్టాక్‌ మార్కెట్లకు కూడా సెలవు ఇచ్చారు. 


అయోధ్య రామాలయంలో రామ్‌ లల్లా ‍‌(Ram Lalla) విగ్రహ ప్రాణ ప్రతిష్టకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 12:15 నుంచి 12:45 గంటల మధ్య 'ప్రాణ ప్రతిష్ఠ' (Pran Pratishtha) జరుగుతుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. మొదట, ప్రధాని నరేంద్ర మోదీ రామ్‌ లల్లా విగ్రహాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత, ఇతర ప్రముఖులకు రామదర్శనం లభిస్తుంది.


సాధారణంగా స్టాక్‌ మార్కెట్లకు శనివారం రోజున సెలవు. అయితే, సోమవారం మార్కెట్లకు సెలవు ఇచ్చారు కాబట్టి, అసాధారణ రీతిలో శనివారం నాడు (20 జనవరి 2023) మార్కెట్‌ పూర్తి స్థాయిలో పని చేసింది.


శనివారం స్టాక్ మార్కెట్ ముగింపు ఇలా..


శనివారం స్టాక్ మార్కెట్ కదలికలు కాస్త మిశ్రమంగా ఉన్నాయి. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ 400 పాయింట్లకు పైగా ఎగబాకి మార్కెట్‌లో స్టార్ పెర్ఫార్మర్‌గా నిలిచింది.


మార్కెట్ ముగింపు సమయానికి, BSE సెన్సెక్స్ 259.58 పాయింట్లు లేదా 0.36 శాతం క్షీణతతో 71,423 స్థాయి వద్ద ఆగింది. NSE నిఫ్టీ 50.60 పాయింట్లు లేదా 0.23 శాతం క్షీణతతో 21,571 వద్ద క్లోజ్‌ అయింది.


సెన్సెక్స్‌30 ప్యాక్‌లో.. 24 షేర్లలో ట్రేడింగ్ నష్టాల్లో ముగియగా, కేవలం 6 స్టాక్స్‌ మాత్రమే లాభాల్లో క్లోజ్‌ అయ్యాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో కోటక్ మహీంద్ర బ్యాంక్ మొదటి స్థానంలో ఉంది, 2.30 శాతం లాభం సాధించింది. బ్యాంక్ త్రైమాసిక ఫలితాలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండటంతో బ్యాంకింగ్‌ సెక్టార్‌ షేర్లలో పెరుగుదల కనిపించింది. ICICI బ్యాంక్ స్టాక్‌ 1.24 శాతం గెయిన్‌తో రెండో స్థానంలో నిలిచింది, దాని త్రైమాసిక ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. పవర్ గ్రిడ్ 0.76 శాతం, SBI 0.61 శాతం, HDFC బ్యాంక్ 0.54 శాతం చొప్పున పెరిగాయి. యాక్సిస్ బ్యాంక్ 0.15 శాతం నష్టపోయింది.


నిఫ్టీ50 ప్యాక్‌లో... డే ట్రేడింగ్‌లో 20 షేర్లు లాభాల్లో ముగిస్తే, 30 షేర్లు క్షీణించాయి. నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌లో కోల్ ఇండియా స్టాక్‌ 4.11 శాతం పెరిగింది, అత్యధికంగా లాభపడింది. అదానీ పోర్ట్స్ 3.34 శాతం లాభంతో ముగిసింది. కోటక్ మహీంద్ర బ్యాంక్ 2.59 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2.48 శాతం పెరుగుదలతో క్లోజ్‌ అయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 1.24 శాతం లాభం సాధించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఇంటి ఓనర్‌ పాన్ ఇవ్వకపోయినా HRA క్లెయిమ్‌ చేయొచ్చు, ఎలాగో తెలుసా?