Stock Market Telugu update: స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ సూచీలు ఉదయం నుంచీ ఫ్లాట్‌గా కదలాడాయి. మిగిలిన సూచీలూ రేంజ్‌బౌండ్‌లోనే ట్రేడ్ అయ్యాయి. క్రూడాయిల్ సెగ తగ్గినా ద్రవ్యోల్బణం నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఉత్సాహంగా కొనుగోళ్లు చేపట్టలేదు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 304 పాయింట్లు నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 17,300 దిగువన ముగిసింది.
BSE Sensex
క్రితం సెషన్లో 57,989 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,198 వద్ద మొదలైంది. ఉదయం నుంచి సూచీ ఫ్లాట్‌గానే ట్రేడ్ అయింది. 58,000-58,200 మధ్యే రేంజ్‌బౌండ్‌లో కదలాడింది. ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వకముందు 58,416 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకున్న సూచీ ఆ తర్వాత 57,568 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 304 పాయింట్ల నష్టంతో 57,684 వద్ద ముగిసింది.
NSE Nifty
మంగళవారం 17,315 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,315 వద్ద మొదలైంది. కొనుగోళ్ల ఊపు లేకపోవడంతో రేంజ్‌బౌండ్‌లోనే కదలాడింది. 17,442 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకున్న సూచీ మధ్యాహ్నం తర్వాత 17,199 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. చివరికి 69 పాయింట్ల నష్టంతో 17,245 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంకు 36,627 వద్ద ఆరంభమైంది. 36,827 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల సెగతో 36,627 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 201 పాయింట్ల నష్టంతో 36,147 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీలో 21 కంపెనీల షేర్లు లాభపడగా 29 నష్టపోయాయి. దివీస్ ల్యాబ్, హిందాల్కో, టాటాస్టీల్, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్ 1 నుంచి 3 శాతం వరకు మెరుగయ్యాయి. కొటాక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, బ్రిటానియా, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా షేర్లు పతనమయ్యాయి. హెల్త్‌కేర్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. ఆటో, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీలో అమ్మకాలు కనిపించాయి.