టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు . అలా అని ఆయన అనుకోరు. తన సంతోషాన్ని.. కోపాన్ని ఆయన దాచుకోరు. ఇటీవల రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌పై ఆయన విరుచుకుపడిన వైనం ఇంకా వైరల్‌గానే ఉంది. ఇప్పుడు డాన్స్ చేస్తూ మరోసారి ట్రెండీగా మారిపోయారు. జర్మనీలోని బెర్లిన్ సమీపంలో ఇటీవల టెస్లా భారీ ఫ్యాక్టరీని నిర్మించింది. దీనికి గిగా ఫ్యాక్టరీ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయింది. కార్ల ఉత్పత్తి కూడా ప్రారంభమయింది. ఈ ఉత్పత్తిని ప్రారంభిచేందుకు మస్క్ జర్మనీ వెళ్లాడు. అక్కడ గిగా కార్ల ఉత్పత్తిని ప్రారంభించి.. కార్లు బయటకు వచ్చిన తర్వాత తన సంతోషాన్ని ఆపుకోలేకపోయాడు. డాన్స్ చేశాడు. 


 






టెస్లా గిగాఫ్యాక్టరీలో వై మోడల్‌ కారును ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కారు పక్కనే  ఎలన్‌ మస్క్‌ డ్యాన్స్‌ చేశారు. ఒక్కసారిగా ఎలన్‌ మస్క్‌ డ్యాన్స్‌ చూసిన అక్కడి వారు కేరింతలు, చప్పట్లతో మరింత ఉత్సాహాపరిచారు. ఎలన్‌ మస్క్‌ మూవ్‌మెంట్స్‌ను క్యాచ్‌ చేసేందుకు వచ్చిన డ్రోన్‌ కెమెరాను చూసి మస్క్‌ మరింతగా ఉత్సాహంగా డాన్స్ చేశారు. 


జర్మనీ కంటే ముందు చైనాలో షాంఘైలో ఎలన్ మస్క్ టెస్లా గిగా ఫ్యాక్టరీని నిర్మించారు. అక్కడి ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వెళ్లిన మస్క్ ... ఇదే స్టైల్లో డాన్స్ చేశారు. ఆ వీడియోను.. ఇప్పటి డాన్స్ ను పోల్చి చూపిస్తూ చాలా మంది... మెరుగయ్యారని కితాబులు ఇస్తున్నారు. 


 






ఎలన్ మస్క్ ఇండియాలోనూ కార్లు అమ్మాలనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఫ్యాక్టరీ పెట్టాలని కోరుతోంది. కానీ చైనా, జర్మనీ ఫ్యాక్టరీల్లో తయారయ్యేవి అమ్మాలని ప్రణాళికలతో మస్క్ ఉన్నారు కానీ ఫ్యాక్టరీ పెట్టే ఉద్దేశంలో లేరు. కానీ పన్ను రాయితీలు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం పన్ను రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు.. ఫ్యాక్టరీ పెడితేనే పన్ను రాయితీలు ఇస్తామని చెబుతోంది.