Stock Market Closing On 18 September 2024: వడ్డీ రేట్లకు సంబంధించి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తీసుకోనున్న నిర్ణయాల ఎఫెక్ట్ భారత స్టాక్ మార్కెట్‌పై పడింది. మన మార్కెట్లు ఈ రోజు (బుధవారం, 18 సెప్టెంబర్ 2024) ఒడుదొడుకులను ఎదుర్కొని, చివరకు నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడే ట్రేడ్‌లో ఆల్ టైమ్ హైని తాకిన మార్కెట్లు, మధ్యాహ్నం నుంచి అమ్మకాల కారణంగా పట్టు తప్పి పడిపోయింది. యూఎస్ వడ్డీ రేట్ల ప్రభావం ఎక్కువగా ఉండే ఐటీ షేర్లలో భారీ క్షీణత స్పష్టంగా (ప్రాఫిట్ బుకింగ్) కనిపించింది, మార్కెట్లను అవి కిందకు లాగాయి. అయితే, నేటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్ షేర్లలో బలమైన కొనుగోళ్లు కనిపించాయి. ఫెడ్ నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో, ఇన్వెస్టర్లు "వెయిట్ అండ్ వాచ్" మోడ్‌లోకి వెళ్లారు.
బుధవారం ఇంట్రా-డే ట్రేడింగ్‌లో BSE సెన్సెక్స్ తాజా గరిష్ట స్థాయి 83,326.38ని తాకింది. NSE నిఫ్టీ కూడా బుధవారం సెషన్‌ను ముగించే ముందు 25,482.20 గరిష్ట స్థాయిని టచ్ చేసింది.
ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 131.43 పాయింట్లు లేదా 0.16% తగ్గి 82,948.23 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 41 పాయింట్లు లేదా 0.16% పడిపోయి 25,377.55 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. ఈ ఉదయం సెన్సెక్స్ 83,037.13 వద్ద, నిఫ్టీ 25,402.40 వద్ద ఓపెన్ అయ్యాయి.
పెరిగిన & పడిపోయిన షేర్లు
నిఫ్టీ50 ప్యాక్‌లో 33 స్టాక్స్ నష్టాల్లో కూరుకుపోతే, 17 స్టాక్స్ లాభాలను జోడించాయి. TCS, ఇన్ఫోసిస్, HCL టెక్, టెక్ మహీంద్రా, విప్రో షేర్లు టాప్ లూజర్స్‌గా ఉన్నాయి, 3.50 శాతం వరకు పతనంతో రోజును ముగించాయి. మరోవైపు.. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా, HDFC బ్యాంక్ షేర్లు 4.22 శాతం వరకు లాభపడ్డాయి, టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.
BSE స్పేస్‌లో 19 షేర్లు లాస్ అయ్యాయి, 11 షేర్లు ప్రాఫిట్స్ అందుకున్నాయి. TCS, ఇన్ఫోసిస్, Tech మహీంద్రా, HCL టెక్, సన్ ఫార్మా స్టాక్స్ 3.46 శాతం వరకు తగ్గాయి. అదే సమయంలో... బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా, HDFC బ్యాంక్ షేర్లు 3.36 శాతం వరకు లాభాలతో గ్రీన్‌లో ముగిశాయి.
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వరుసగా మూడవ రోజూ ర్యాలీని కొనసాగించింది, దాదాపు 2% పెరిగింది.
BSEలో మొత్తం 4.058 షేర్లు ట్రేడ్ అవగా, వాటిలో.. 1,712 స్టాక్స్ లాభాలతో, 2,237 నష్టాలతో ముగిశాయి. 109 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
సెక్టార్ల వారీగా చూస్తే..
నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3.05 శాతం నష్టంతో స్థిరపడింది. అదే సమయంలో... ఫైనాన్షియల్, బ్యాంకింగ్ రంగాలు దూసుకెళ్లాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్ నిఫ్టీ సూచీలు వరుసగా 1.40 శాతం & 1.06 శాతం పెరిగాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు కూడా 0.96 శాతం వరకు లాభపడ్డాయి.
భారీగా తగ్గిన మార్కెట్ క్యాప్
మార్కెట్ పతనం, ముఖ్యంగా ఐటీ స్టాక్స్, మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో భారీ పతనం కారణంగా, BSEలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ. 467.58 లక్షల కోట్ల వద్ద ముగిసింది. నిన్నటి ట్రేడింగ్ సెషన్‌లో ఇది రూ. 470.29 లక్షల కోట్ల వద్ద ఉంది. అంటే, ఈ రోజు సెషన్‌లో ఇన్వెస్టర్లు రూ. 2.71 లక్షల కోట్లు నష్టపోయారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఇల్లు కొనడం బెటరా, అద్దెకు ఉండడం బెటరా? ఈసారి మీ డౌట్ తీరిపోతుంది