Udayanidhi Stalin will take charge as Deputy CM Tamil nadu DMK : తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ పార్టీ తదుపరి నాయకత్వాన్ని ట్రాక్ లోకి తేవాలని నిర్ణయించుకున్నారు. మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు ఉదయనిధిని.. ఇప్పటికే క్రియాశీలకం చేశారు. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా నెంబర్ 2 పొజిషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత స్టాలిన్..  ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయించే అంశంపై పార్టీ  నేతలతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది.                   

  


సినిమా హీరోగా, నిర్మాతగా ఉన్న  ఉదయనిధి.. డీఎంకే యువజన విభాగానికి అధ్యక్షుడిగా పని చేశారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. స్టాలిన్ తర్వాత ప్రభుత్వంలో అత్యంత పవర్ ఫుల్ గా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలో  పార్టీ తరపున ప్రచార భారం అంతా ఆయనే మోశారు. యువతలో ప్రత్యేకమైన గుర్తింపు ఉండటంతో.. వచ్చే ఎన్నికల నాటికి ఆయనను డీఎంకే ప్రధాన ఫేస్ గా తెరపైకి తేవాలని స్టాలిన్ డిసైడయినట్లుగా తెలుస్తోంది.                     


జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం మరో అడుగు - రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం - ఇక ఒక్క అడుగే


స్టాలిన్ మొదటి సారి సీఎం అయినప్పటికి ఆయన వయసు 71 సంవత్సరాలు, ఈ కారణంగా పార్టీకి యువ నాయకత్వం ముఖ్యమన్న అంచనాలతో ఉదయనిధిని మరింతగా ప్రోత్సహించాలని నిర్ణయించకున్నారు. పార్టీ నేతలు కూడా.. ఉదయనిధికి పార్టీ బాధ్యతలతో పాటు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కొంత కాలంగా కోరుతూ వస్తున్నారు. ఈ క్రమంలో స్టాలిన్ కూడా ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయంచుకున్నట్లుగా తెలుస్తోంది. 


ప్రస్తుతం ఉదయనిధి క్రీడా, యువజన సంక్షేమ మంత్రిగా ఉన్నారు. తనను డిప్యూటీ సీఎంను చేస్తున్నారన్న వార్తలపై ఆయన పెద్దగా స్పందించడం లేదు. ఏదైనా సీఎం నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. కరుణానిధి గతంలో సీఎంగా ఉన్నప్పుడు.. స్టాలిన్ కూడా డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తించారు. ఆ పరిపాలనా అనుభవంతో.. ఆయన కరుణానిధి అనారోగ్యంతో యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమైన సమయంలో కూడా..  డీఎంక ప్రాబల్యం తగ్గకండా నిర్వహించారని అంటున్నారు. ఇప్పుడు ఉదయనిధి కూడా అదే విధంగా  డిప్యూటీ సీఎంగా అయితే.. డీఎంకే భవిష్యత్ లీడర్ గా కూడా ఉపయోగపడతారని భావిస్తన్నారు. 


కోట్లు సంపాదించే ఇండియన్స్ రాకెట్ వేగంతో పెరిగిపోతున్నారు - ఎలా సంపాదిస్తున్నారంటే ?


అసెంబ్లీ ఎన్నికల నాటికి సినీ నటుడు విజయ్ కొత్త పార్టీతో బలమైన శక్తిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.  ఈ క్రమంలో స్టాలిన్ ఉదయనిధికి ప్రమోషన్ ఇచ్చేందుకు  రెడీ కావడం తమిళ రాజకీయవర్గాల్లో అనూహ్య చర్చలకు కారణం అవుతోంది.